లండన్: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి ముందు ఇంగ్లండ్ అభిమానులకు ఆ జట్టు శుభవార్త అందించింది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడని తెలిపింది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌లో బెన్ స్టోక్స్ బరిలోకి దిగుతాడని అధికారికంగా ప్రకటించింది. తమ విజ్ఞప్తిని మన్నించి బెన్ స్టోక్స్.. వన్డే రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడని తెలిపింది.
దాంతో ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్ ప్రొవిషనల్ జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ నాలుగు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టను కూడా ఈసీబీ ప్రకటించింది. ప్రపంచకప్ ముందు టీమ్ పర్పామెన్స్‌ను అనలైజ్ చేసి జట్టు ఎంపికను ఫైనలైజ్ చేయనున్నారు.

ఆగస్టు 30 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ నాలుగు టీ20లు, నాలుగు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు నాలుగు టీ20ల సిరీస్ జరగనుండగా.. సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు వన్డే జరగనుంది.
ఈ రెండు సిరీస్‌ల్లో ఆడే వేర్వేరు జట్లను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.
ప్రపంచకప్ కోసం ఇంగ్లండ్ టీమ్:
జోస్ బట్లర్(కెప్టెన్), బెన్ స్టోక్స్, జోరూట్, జాసన్ రాయ్, మొయిన్ అలీ, బెయిర్ స్టో, సామ్ కరన్, లివింగ్ స్టోన్, డేవిడ్ మలాన్, ఆదిల్ రషీద్, టోప్లీ, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్
ఇంగ్లండ్ టీ20 టీమ్:
జోస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రన్, బెన్ డకెట్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జాన్ టర్నర్, ల్యూక్ వుడ్
ఇంగ్లండ్ వన్డే టీమ్:
జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోరూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, డేవిడ్ విల్లే, మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్