World Cup 2023: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ఆరంభ మ్యాచ్‌కు ఆ స్టార్ ప్లేయర్ దూరం!
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఇంగ్లండ్.. గత టోర్నీ రన్నరప్ న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న బెన్ స్టోక్స్ తొలి మ్యాచ్ ఆడటంపై సందేహాలున్నాయని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పష్టం చేశాడు. అతను తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. 'బెన్ స్టోక్స్ తొంటి నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను ఫిజియోల పర్యవేక్షణలో పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు.

బెన్ స్టోక్స్ ట్రైనింగ్‌కు హాజరయ్యాక గాయం తీవ్రతపై స్పష్టత రానుంది. అప్పుడు బెన్ స్టోక్స్‌ను ఆడించాలా? వద్దా? అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటాం. మ్యాచ్ ఆడే ఫిట్‌నెస్ లేకపోతే జట్టు నుంచి తప్పిస్తాం. ఎలాంటి రిస్క్ తీసుకోం. అతను పూర్తిగా కోలుకునేవరకు ఆడించం.'అని జోస్ బట్లర్ తెలిపాడు.
బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయిన బెన్ స్టోక్స్ దూరమవడం ఇంగ్లండ్‌కు కోలుకోలేని దెబ్బనే. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించగల సామర్థ్యం బెన్ స్టోక్స్ సొంతం. 2019 వన్డే ప్రపంచకప్ ఇంగ్లండ్ గెలవడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.

వాస్తవానికి వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన బెన్ స్టోక్స్.. ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ రిక్వెస్ట్ మేరకు యూటర్న్ తీసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ వరకు వన్డేల్లో కొనసాగుతానని ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications