Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: బెడిసికొట్టిన ఇంగ్లండ్ బజ్‌బాల్.. న్యూజిలాండ్ ముందు ఈజీ టార్గెట్!

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 283 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహం బెడిసికొట్టడంతో సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. ధాటిగా ఆడాలనే ఆతృతలో ఇంగ్లండ్ బ్యాటర్లు అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నారు.

న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(3/48) తీన్మార్ బౌలింగ్‌కు మిచెల్ సాంట్నర్(2/37), గ్లేన్ ఫిలిప్స్(2/17) దోబార్ బౌలింగ్ తోడవ్వడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది.

జోరూట్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 77) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్(42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. జానీ బెయిర్ స్టో(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు.

World Cup 2023: Bazball fail to ‘bazz’ as England post 282/9 vs New Zealand

న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లకు తోడుగా.. మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్డ్, రచిన్ రవీంద్రకు తలో వికెట్ దక్కింది.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. సిక్సర్‌తో ఈ ప్రపంచకప్ టోర్నీని ఆరంభించిన అతను పవర్ ప్లేలో న్యూజిలాండ్ బౌలర్లపైకి ఎదురు దాడికి దిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ మలాన్ ఇబ్బంది పడినా.. జానీ భాయ్ స్వేచ్చగా చెలరేగాడు. డేవిడ్ మలాన్ మాత్రం పదే పదే బీట్ అయ్యాడు.

మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో లైఫ్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరకు మ్యాన్ హెన్రీ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్(14) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన జోరూట్‌తో బెయిర్ స్టో ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది.

దెబ్బకొట్టిన స్పిన్నర్లు..
అనంతరం స్పిన్నర్లను రంగంలోకి దింపిన టామ్ లాథమ్.. ఫలితాన్ని రాబట్టాడు. జోరు మీదున్న జానీ బెయిర్ స్టో(33)ను మిచెల్ సాంట్నర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ వరుస బౌండరీలతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అయితే అతన్ని రచిన్ రవీంద్ర క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే మొయిన్ అలీ(11) ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 118 పరుగులకే ఇంగ్లండ్ 4 కీలక వికెట్లు కోల్పోయింది.

ఆదుకున్న జోరూట్, బట్లర్..
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ జోస్ బట్లర్‌తో కలిసి జోరూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ క్రీజులో సెట్ అయిన తర్వాత ధాటిగా ఆడింది. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోరూట్.. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.

క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని మ్యాట్ హెన్రీ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన జోస్ బట్లర్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చి లియామ్ లివింగ్ స్టోన్(20)‌తో పాటు జోరూట్ ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. సామ్ కరణ్, క్రిస్ వోక్స్ సైతం విఫలమవ్వడంతో ఇంగ్లండ్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

Story first published: Thursday, October 5, 2023, 17:53 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+