ధర్మశాల: వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. అఫ్గానిస్థాన్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెహ్‌దీ హసన్ మీరాజ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన మెహ్‌దీ హసన్ మీరాజ్(57), బౌలింగ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. 37.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. రెహ్మానుల్లా గుర్బాజ్(62 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 47), ఇబ్రహీమ్ జడ్రాన్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), అజ్మతుల్లా ఒమార్జాయ్(20 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్(3/25), షకీబ్ అల్ హసన్(3/30) మూడేసి వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్(2/34) రెండు వికెట్లు పడగొట్టాడు. టస్కిన్ అహ్మద్(1/32)కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(73 బంతుల్లో 5 ఫోర్లతో 57), నజ్ముల్ హొస్సేన్ షాంటో(83 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఓమర్జాయ్ తలో వికెట్ తీసారు.
బంగ్లాదేశ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అక్టోబర్ 10న ఈ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 11న భారత్‌తో అఫ్గానిస్థాన్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.