Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: పాకిస్థాన్ పేలవ ప్రదర్శన.. కెప్టెన్సీకి బాబర్ ఆజామ్ గుడ్‌బై!

World Cup 2023, ENG vs PAK:వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు టాస్ ఓడి ముందుగా బౌలింగ్ చేయడంతో సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఈ టోర్నీలో టీమ్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని బాబర్ ఆజామ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్సీ వదులుకోవడంపై మల్లగుల్లాలు పడుతున్న బాబర్ ఆజామ్.. ఇప్పటికే పీసీబీ మాజీ ఛీఫ్, కామెంటేటర్ రమీజ్ రాజాతో ఈ విషయం చర్చించినట్లు ప్రచారాం జరుగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ కథనం ప్రకారం.. స్వదేశం చేరిన తర్వాత కుటుంబ సభ్యులతో పాటు ప్రస్తుత పీసీబీ చీఫ్‌తో చర్చించిన అనంతరం కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై బాబర్ ఆజామ్ నిర్ణయం తీసుకోనున్నాడని తెలుస్తోంది.

World Cup 2023: Babar Azam likely to step down as Pakistan skipper

కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే.. మూడు ఫార్మాట్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే బాబర్ ఆజామ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాబర్ ఆజామ్ సారథ్యంలో పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ 2022తో పాటు ఆసియా కప్ 2022 ఫైనల్ ఆడింది. కానీ రెండు ఫైనల్లో ఓడి ఇంటిదారి పట్టింది.

పీసీబీలో సరైన కార్యవర్గం లేకపోవడంతో పాటు ప్రతీ 3-6 నెలల మధ్య చైర్మన్‌ను మారుస్తుండటంతో బాబర్ ఆజామ్ తీవ్ర చికాకుకు గురైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు మాట్లాడిన బాబర్ ఆజామ్.. కెప్టెన్సీతో తనేం ఒత్తిడికి గురవ్వడం లేదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ కెప్టెన్‌గా నాపై ఎలాంటి ఒత్తిడి లేదు.

గత మూడేళ్లుగా జట్టును ఎలా నడిపిస్తూ ఆడుతున్నానో అలానే ఆడుతున్నా. కానీ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాను. దాంతో అందరూ నేను అనవసర ఒత్తిడికి గురవుతున్నానని చెబుతున్నారు. టీవీ ముందు కూర్చొని చాలా విమర్శలు చేయవచ్చు. నాకు సలహా ఇచ్చే వ్యక్తులు నేరుగా నా నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు.

నా కెప్టెన్సీ భవితవ్యంపై తర్వాత ఆలోచిస్తాను. భారత్‌లో ఆడిన అనుభవం లేకపోవడం కూడా నా పేలవ ప్రదర్శనకు ఓ కారణం. దాంతోనే అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాను.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

బాబర్ ఆజామ్ కెప్టెన్సీలో 20 టెస్ట్‌లు ఆడిన పాకిస్థాన్ 10 విజయాలతో పాటు 4 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 43 వన్డేల్లో 26 గెలిచి 14 ఓడింది. 71 టీ20ల్లో 42 విజయాలు సాధించి 23 మ్యాచ్‌ల్లో ఓడింది. 6 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

Story first published: Saturday, November 11, 2023, 17:30 [IST]
Other articles published on Nov 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+