Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్ట్.. జట్టు నుంచి కావాలనే తప్పించారా?

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు జట్టుకు దూరమైన అక్షర్ పటేల్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ గాయంతోనే ఆసియా కప్ ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రపంచకప్ జట్టు నుంచి అక్షర్ పటేల్‌ను తప్పించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈ నిర్ణయంపై అక్షర్ పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

World Cup 2023:

సోషల్ మీడియా వేదికగా పరోక్ష పోస్ట్‌తో బీసీసీఐ తీరుపై విమర్శలు గుప్పించాడు. 'కామర్స్ బదులు సైన్స్ చదివి ఉంటే బాగుండేది. ఇంకా ఓ మంచి పీఆర్‌ను పెట్టుకుంటే ఇంకా బాగుండేది'అని ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈ కామెంట్స్‌కు గుండెపగిలిన హార్ట్ సింబల్ ఏమోజిని జత చేశాడు.
ఏమనుకున్నాడో ఏమో కానీ వెంటనే ఈ పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయితే అప్పటికే ఈ పోస్ట్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అక్షర్ పటేల్ పోస్ట్‌తో అతన్ని కావాలనే తప్పించారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

గాయం నుంచి కోలుకున్నా.. అశ్విన్‌ను ఆడించాలనే ఉద్దేశంతో అక్షర్‌ను తప్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి పీఆర్ ఉండడం వల్లే రవిచంద్రన్ అశ్విన్‌కు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కిందని కూడా పరోక్షంగా కామెంట్ చేసినట్లు అర్థమవుతోంది.

 Axar Patel

అయితే ఈ పోస్ట్ అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది బీసీసీఐతో పాటు టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టినట్లుగా ఉంది. గతంలో అంబటి రాయుడు, వృద్దిమాన్ సాహా ఇలానే టీమ్‌మేనేజ్‌మెంట్‌ను నిలదీసి జట్టుకు మరింత దూరమయ్యారు.

అయితే అక్షర్ పటేల్‌కు ఇలా చివరి నిమిషంలో చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి కాదు. 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైన రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్న అక్షర్ పటేల్, 2019 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు.

Story first published: Friday, September 29, 2023, 16:52 [IST]
Other articles published on Sep 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+