World Cup 2023: ఆసీస్‌కు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ప్లేయర్ దూరం!
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ అష్టన్ అగర్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. అగర్ ప్రస్తుతం కాలి కండరాల గాయంతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో అగర్ గాయపడ్డాడు.
తన సతీమణి ప్రసవం సమయంలో పక్కనే ఉండేందుకు సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశం పయనమయ్యాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డే సిరీస్ అతను ఆడలేదు. ఆసీస్ మీడియా కథనాల ప్రకారం అగర్ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు నాలుగు వారాల సమయం పడుతుందంట. ఈ క్రమంలోనే అతను వన్డే ప్రపంచకప్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ట్రావిస్ హెడ్ దూరం కాగా.. ఇప్పుడు అగర్ కూడా దూరమైతే ఆసీస్ మరింత బలహీనం కానుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్(84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 96), డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56) విధ్వంసకర బ్యాటింగ్ చెలరేగగా.. స్టీవ్ స్మిత్(61 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 74), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 9 ఫోర్లతో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(3/81) మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/48) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్ (1/68), ప్రసిధ్ కృష్ణ(1/45) తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేదనకు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది. రోహిత్ శర్మ(57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(61 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 56), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 48) కీలక ఇన్నింగ్స్ ఆడారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(4/40) భారత్ పతనాన్ని శాసించాడు. జోష్ హజెల్ వుడ్(2/42) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(1/59), కామెరూన్ గ్రీన్ (1/30), తన్వీర్ సంఘా(1/61) తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications