For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు..!

లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా చెత్త రికార్డు నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. గురువారం సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో ఆసీస్ ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 134 పరుగులతో చిత్తు అయ్యింది.

ఇదే టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఆసీస్.. 2019 వన్డే ప్రపంచకప్‌‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా ఓటమిపాలైంది.

 World Cup 2023: Australia first time lost 4 consecutive Matches in the history of World Cups

2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన ఆసీస్.. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 10 పరుగులతో పరాజయం పాలైంది. వన్డే ప్రపంచకప్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచి పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆసీస్.. ఇప్పుడు వరుస పరాజయాలతో అప్రతిష్టను మూటగట్టుకుంది.

వన్డే ప్రపంచకప్ 2023లోనూ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు.. భారత్ ఇచ్చిన షాక్‌తో డీలా పడిపోయింది. సఫారీ చేతిలోనూ చిత్తయ్యి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఆ జట్టు రన్‌రేట్ కూడా( -1.846) నెగటీవ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆసీస్ ముందడుగు వేయాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం 6 మ్యాచ్‌లు అయినా గెలవాలి. అది కూడా మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తేనే సెమీస్ చేరే ఛాన్స్ ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్ (106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109) సెంచరీ నమోదు చేయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా సౌతాఫ్రికా పేసర్ల ధాటికి 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(74 బంతుల్లో 3 ఫోర్లతో 46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(2/54), కేశవ్ మహరాజ్(2/30), టబ్రైజ్ షంసీ(2/38) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

Story first published: Thursday, October 12, 2023, 22:49 [IST]
Other articles published on Oct 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+