Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రికార్డ్ నా మొగుడికే సొంతం: అనుష్క శర్మ

Anushka Sharma wishes Virat Kohli: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ నేడు(నవంబర్ 5) 35వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కింగ్ కోహ్లీకి సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక కోహ్లీ సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ సైతం తనదైన శైలిలో తన మొగుడికి విషెస్ తెలియజేసింది. కోహ్లీ అసాధారణ రికార్డులను ప్రస్తావిస్తూ.. 'నా మొగుడు బంగారం'అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బర్త్‌డే మెసేజ్‌ షేర్ చేసింది.

World Cup 2023: Anushka Sharma shares Virat Kohlis rare bowling record on his birthday

'జీవితంలోని ప్ర‌తి పాత్ర‌లో అతను అసాధార‌ణ వ్య‌క్తినే. అతని కిరీటంలో మరిన్ని కలికితురాయిలు చేర్చుకొంటున్నాడు. నేను నిన్ను ఈ జీవితంలో.. ఆ తర్వాత.. ఎన్నటికీ ఎలా ఉన్నా ప్రేమిస్తూనే ఉంటాను'అని అనుష్క శర్మ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను కూడా అనుష్క శర్మ గుర్తు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో జీరో బాల్‌కు వికెట్ తీసిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో తొలిసారి బౌలింగ్ చేసిన కోహ్లీ.. తొలి బంతికే కెవిన్ పీటర్సన్‌ను ఔట్ చేశాడు. కోహ్లీ వైడ్‌ బాల్‌కు కెవిన్ పీటర్సన్‌ స్టంపౌటవ్వడంతో ఈ అరుదైన ఘనతను దక్కింది. ఈ రికార్డును తాజాగా గుర్తు చేసిన అనుష్క శర్మ.. ఈ రికార్డ్ తన మొగుడికి మాత్రమే సొంతమని, మరెవరూ కూడా సాధించలేదని రాసుకొచ్చింది.

2014లో ఓ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకున్న ఈ ఇద్దరూ మూడేళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలి 2017లో వివాహం చేసుకున్నారు. వీరికి వామికా అనే కూతురు పుట్టింది. త్వరలోనే విరుష్క రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను సమం చేస్తాడు.

Story first published: Sunday, November 5, 2023, 17:11 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+