Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: పాక్‌తో మ్యాచ్.. టీమిండియా గెలవాలంటే అతన్ని ఆడించాలి

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా... అసలు సిసలు పోరుకు సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అహ్మదాబాద్ వేదికగా శనివారం జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి.

డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్ సైతం పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్‌‌తో అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్‌‌పై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో పేసర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునే బదులు మహమ్మద్ షమీని ఆడించాలని సూచించాడు.

World Cup 2023: Aakash Chopra says India should play Mohammed Shami ahead of Shardul Thakur vs PAK

'శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీలో ఎవరిని ఆడించాలనే చర్చ సుదీర్ఘంగా నడుస్తూనే ఉంటుంది. చాలా సార్లు టీమిండియా మేనేజ్‌మెంట్ శార్దూల్ ఠాకూర్‌ వైపు మొగ్గు చూపింది. 8వ నెంబర్‌లో బ్యాటింగ్ చేయగల సత్తా శార్దూల్‌కు ఉందని అతనికి షమీ కంటే ప్రాధాన్యత ఇస్తోంది.

అఫ్గానిస్థాన్‌ వంటి పసికూన జట్టుతో కూడా శార్దూల్‌ను ఆడించడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ జట్టుతో కూడా 8వ స్థానంలో బ్యాటింగ్ చేసే ఆటగాడు అవసరమా? నా అభిప్రాయం ప్రకారమైతే ఆ అవసరమే లేదు. బిగ్ హిట్టింగ్ చేసే ఆటగాళ్లు లేకుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి జట్లతో ఆడినప్పుడు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ అవసరం పెద్దగా ఉండదు.

World Cup 2023: Aakash Chopra says India should play Mohammed Shami ahead of Shardul Thakur vs PAK

వాస్తవానికి శార్దూల్ ఠాకూర్ గొప్ప బ్యాటరేం కాదు. 8వ స్థానంలో అతను కేవలం బంతికి ఓ పరుగులా మాత్రమే బ్యాటింగ్ చేయగలడు. 20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే హిట్టర్ ఏం కాదు. బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్‌ను ఆడిస్తున్నారు. కానీ అతని కంటే షమీని ఆడించడం ఉత్తమం. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనైనా శార్దూల్ ఠాకూర్‌కు బదులు మహమ్మద్ షమీని తీసుకోవాలి. ఈ మ్యాచ్‌లో శార్దూల్ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది.'అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.

అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే శనివారం జరిగే మ్యాచ్ కోసం ఎలాంటి పిచ్ తయారు చేశారో తెలియదు. స్పిన్ పిచ్ అయితే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో ఆడుతోంది. అప్పుడు అశ్విన్ జట్టులోకి వస్తాడు. పేస్ పిచ్ అయితే ఎక్స్‌ట్రా పేసర్‌తో ఆడుతోంది. అప్పుడు శార్దూల్ ఠాకురా? షమీ అనేది తేలాల్సి ఉంది.

Story first published: Thursday, October 12, 2023, 20:43 [IST]
Other articles published on Oct 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+