Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించిన అంబటి రాయుడు!

టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ను గెలిపించాలనే చిరకాల స్వప్నాన్ని.. రిటైర్మెంట్ అనంతరం తీర్చుకున్నాడు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2024‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో అంబటి రాయుడు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాయుడు (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) సూపర్ బ్యాటింగ్‌తో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్‌ను ముద్దాడింది.

World Championship of Legends 2024 Ambati Rayudu helps India beat Pakistan in final

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ మైదానం వేదికగా జరిగిన ఈ తుదిపోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్(36 బంతుల్లో 41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత పేసర్ అనురీత్ సింగ్ మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, హర్భజన్ సింగ్‌లు తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంబటి రాయుడు(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. యూసఫ్ పఠాన్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపులు మెరిపించాడు. గుర్‌క్రీత్ సింగ్(33 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో అమీర్ యామిన్ 2 వికెట్లు తీయగా.. అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ టోర్నీలో రాబిన్ ఊతప్పతో కలిసి ఓపెనింగ్ చేసిన రాయుడు.. ఫైనల్లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పాక్ బౌలర్ల ధాటికి రాబిన్ ఊతప్ప(10), సురేశ్ రైనా(4) ఆరంభంలోనే వెనుదిరిగారు. తీవ్ర ఒత్తిడిలో క్రీజులోకి వచ్చిన గురుక్రీత్ సింగ్‌తో కలిసి అంబటి రాయుడు..ఆచితూచి ఆడాడు. ఓవైపు గురుక్రీత్ సింగ్ క్లాస్ ఇన్నింగ్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయగా.. రాయుడు తనదైన శైలిలో బౌండరీలు బాదాడు.

ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించి భారత్ విజయానికి బాటలు వేసాడు. క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్(22 బంతుల్లో 15 నాటౌట్) స్లో బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. కానీ యూసఫ్‌ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. విజయం ముంగిట అతను ఔటవ్వగా..ఇర్ఫాన్ పఠాన్ బౌండరీతో విజయ లాంఛానాన్ని పూర్తి చేశాడు.

Story first published: Sunday, July 14, 2024, 7:46 [IST]
Other articles published on Jul 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+