ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం టెస్ట్ క్రికెట్‌కు కావాల్సిన కొన్ని కీలకమైన అంశాలపై ఫోకస్ పెట్టడంతోనే డబుల్ సెంచరీ సాధించగలిగానని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటన కోసం తాను చాలా కష్టపడ్డానని, దాంతోనే తనకు ఆశించిన ఫలితం దక్కిందని చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి టెస్ట్‌లో శతకం బాదిన గిల్.. రెండో టెస్ట్‌లో ద్విశతకం సాధించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ స్లిప్‌లో అద్భుతంగా అందుకున్నాడు.

రెండో రోజు ఆట అనంతరం అధికారికి బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన శుభ్‌మన్ గిల్..ఈ మ్యాచ్‌పై పట్టు బిగించామని చెప్పాడు. ఫీల్డింగ్ మెరుగ్గా చేస్తే ఈ మ్యాచ్‌లో విజయం సాధించవచ్చని అభిప్రాయపడ్డాడు. 'ప్రస్తుతం మేం మంచి పొజిషన్‌లో ఉన్నాం. ఐపీఎల్ తర్వాత నేను టెస్ట్ క్రికెట్‌కు కావాల్సిన కొన్ని కీలకమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాను. చాలా కష్టపడ్డాను. దానికి ఈ సిరీస్‌లో ప్రతిఫలం దక్కుతుంది. బ్యాటింగ్ చేసే సమయంలో వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలవాలని అనుకున్నాను. ఆటను ఆస్వాదించాలని భావించాను. దాంతోనే డబుల్ సెంచరీ సాధించగలిగాను.
స్లిప్ క్యాచ్ అందుకోవడం సంతోషంగా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ కారణంగా గత రెండు రోజులుగా నేను స్లిప్ క్యాచ్‌లు ప్రాక్టీస్ చేయలేదు. అయినా క్యాచ్ అందుకున్నాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఫీల్డింగ్ చాలా కీలకం. గత మ్యాచ్‌లో మేం వదిలేసిన క్యాచ్‌ల్లో సగం పట్టినా ఫలితం మరోలా ఉండేది.' అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.