Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's World Cup 2024: డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్‌!

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు కీలకం.

విజయం సాధించడమే కాకుండా రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించాలి. అప్పుడే టీమిండియా సెమీస్‌కు అర్హత సాధిస్తోంది. మరోవైపు శ్రీలంక వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. అయితే ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌ను ఓడించింది.

Women s World Cup 2024 Harmanpreet Kaur wins the toss and opted to bat first in IND W vs SL W Match

ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని తెలిపింది.

తుది జట్లు:

భారత్: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సజన, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా సింగ్.

శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవీషా దిల్హరీ, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(కీపర్), అమ కాంచన, సుగంధిక కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రభోదని, ఇనోకా రణవీర.

Story first published: Wednesday, October 9, 2024, 19:55 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+