Womens World Cup 2022: మిథాలీ సేనకు మరో ఓటమి.. సెమీస్ చేరాలంటే ఏం చేయాలంటే?

మౌంట్‌మాంగనీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు మరో పరాజయం ఎదురైంది. వెస్టిండీస్ మహిళలతో గత మ్యాచ్‌లో దుమ్మురేపిన మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు.. వరుస ఓటములతో డీలా పడ్డ ఇంగ్లండ్ చేతిలో బుధవారం ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు(న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో) ఓడిన మిథాలీసేన 4 పాయింట్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్‌పై సాధించిన భారీ విజయంతో భారత్‌కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో టాప్3లో నిలిచింది. అయితే టాప్ 4లో ఉన్న జట్లే సెమీస్ చేరనున్నాయి.

ప్రతీ మ్యాచ్ గెలవాలి..
తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందుండగా.. తర్వాతి రెండు స్థానాల కోసం భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్ పోటి పడుతున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్.. భారత్‌పై విజయంతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. దాంతో మిథాలీసేన సెమీస్ చేరాలంటే తుదపరి ఆడే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగే మ్యాచ్‌లో భారత మహిళలు కచ్చితంగా గెలవాలి. ఈ రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే భారత్‌కు సెమీస్‌కు లైన్ క్లియర్ అవుతోంది. ఇక ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడి బంగ్లాదేశ్ మహిళలతో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.

ఆసీస్‌ను ఓడిస్తే..
మార్చి 18న బలమైన ఆస్ట్రేలియాతో తలపడనున్న మిథాలీ సేన.. 22న బంగ్లాదేశ్, 27 సౌతాఫ్రికాతో పోటీపడనుంది. ఆసీస్‌పై విజయం సాధిస్తే సెమీస్ బెర్త్‌తో పాటు అమ్మాయిల ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా.. నాలుగింటిలో విజయం సాధించి పాయిట్స్‌టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరీ భారత అమ్మాయిలు ఏం చేస్తారో చూడాలి.

4 వికెట్ల తేడాతో ఓటమి..
బుధవారం ఇంగ్లండ్ మహిళలతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మిథాలీ సేన పేలవ బ్యాటింగ్ కారణంగా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 36.2ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(35), హర్మన్‌ప్రీత్ కౌర్(14), రిచా ఘోష్(33), ఝలన్ గోస్వామి(20) మినహా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. 4 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించిన చార్లెట్ డీన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications