Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens World Cup 2022: ఆసీస్ చేతిలో ఓటమి.. మిథాలీ సేన సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలంటే?

Womens World Cup 2022: What do India need to qualify for semi-finals after loss against Australia

హైదరాబాద్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో చెత్త బౌలింగ్‌తో 6 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. దాంతో టోర్నీలో సెమీస్ చేరే అవకాశాలను చేజార్చుకుంది. ఇక వరుసగా ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆసీస్.. ఇతర మ్యాచ్‌లతో సంబంధం లేకుండానే సెమీస్ బెర్త్‌ ఖారారు చేసింది. ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన సౌతాఫ్రికా కూడా 8 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టుకు సెమీస్ బెర్త్ దక్కతుంది.

తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిచినా..

తదుపరి రెండు మ్యాచ్‌లు గెలిచినా..

ఇక ఐదింటిలో మూడు గెలిచిన వెస్టిండీస్ 6 పాయింట్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. చివరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే ఆ జట్టుకు కూడా సెమీస్ బెర్త్ దక్కుతుంది. 8 జట్లతో జరుగుతున్న ఈ టోర్నీలో టాప్-4లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం భారత్ ఐదు మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాలి. అయితే భారత్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ రెండు గెలిచినా భారత్‌కు ఈ స్థానం గ్యారంటీ లేదు. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఆ మూడు జట్లు ఒక్కో మ్యాచ్ ఓడాలి..

ఆ మూడు జట్లు ఒక్కో మ్యాచ్ ఓడాలి..

భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ రెండు మ్యాచ్‌లు మెరుగన రన్ రేట్‌తో గెలవడంతో పాటు న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఓడిపోవాలి. సౌతాఫ్రికా రూపంలో భారత్‌కు గండం ఎదురవ్వనుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మార్చి 22న బంగ్లాదేశ్‌తో, 27న సౌతాఫ్రికాతో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియాతో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. చివరి 12 బంతుల్లో ఆసీస్ విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. 49వ ఓవర్ వేసిన మేఘన సింగ్ సూపర్ బౌలింగ్‌తో కెప్టెన్ మెగ్ లాన్నింగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో పాటు మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో భారత శిభిరంలో ఆశలు చిగురించాయి.

కొంపముంచిన జూలన్

కొంపముంచిన జూలన్

చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 8 పరగులు అవసరమవ్వగా.. జూలన్ గోస్వామి ఫస్ట్ బాల్‌కే బౌండరీ ఇచ్చింది. దాంతో మరింత స్వేచ్చగా ఆడిన బెత్ మూనీ మరో రెండు బంతుల్లోనే 2, 4తో మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసారు. కెప్టెన్ మిథాలీ రాజ్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 68‌తో పాటు యస్తిక భాటియా(83 బంతుల్లో 6 ఫోర్లతో 59), హర్మన్ ప్రీత్ కౌర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో పూజా వస్త్రాకర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) మెరుపులు మెరిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు, అలన కింగ్ రెండు, జెస్స్ జొనాస్సెన్ ఓ వికెట్ తీసింది.

 మెగ్ లాన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్..

మెగ్ లాన్నింగ్స్ సూపర్ ఇన్నింగ్స్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. ఓపెనర్ అలీసా హీలీ(65 బంతుల్లో 9 ఫోర్లతో 72), కెప్టెన్ మెగ్ లాన్నింగ్(107 బంతుల్లో 13 ఫోర్లతో 97)భారీ హాఫ్ సెంచరీలతో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో బెత్ మూనీ(20 బంతుల్లో 4 ఫోర్లతో 30 నాటౌట్) విజయాన్ని సులువు చేసింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీయగా.. మేఘన సింగ్, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. జూలన్ గోస్వామి ఒక్క వికెట్ తీయకపోగా 64 పరుగులు సమర్పించుకుంది.

Story first published: Saturday, March 19, 2022, 16:21 [IST]
Other articles published on Mar 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+