Womens World Cup 2022: మైదానంలో కుప్పకూలిన వెస్టిండీస్ పేసర్.. తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా.. వెస్టిండీస్ పేసర్ షమిలియా కానెల్ ఫిల్డీంగ్ చేస్తూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలింది. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో హుటాహుటిన ఆమెను ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. అయితే కానెల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని టీమ్ కెప్టెన్ స్టఫానీ టేలర్ వెల్లడించింది.
తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటుందో లేదో ఇప్పుడేమీ చెప్పలేమని తెలిపింది. 'ఆమెను అలా చూడటం కాస్త ఆందోళన కలిగించింది. ఆమె పోరాట యోధురాలు. తప్పకుండా మామూలు స్థితికి తిరిగి వచ్చేస్తుందని ఆశిస్తున్నాం'' అని ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ హేలే మాథ్యూస్ చెప్పుకొచ్చింది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. క్యాంప్‌బెల్ (53 నాటౌట్) అర్ధశతకం సాధించడంతో ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనలో మాథ్యూస్ (4/15), ఫ్లెచెర్ (3/29), టేలర్ (3/29) విజృంభించడంతో బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ (4)ను వెనక్కి నెట్టి విండీస్ (6) మూడో స్థానానికి చేరుకుంది. టీమిండియా సెమీస్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు చాలా కీలకం. ఈ క్రమంలో శనివారం ఆసీస్‌తో భారత్ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications