Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens World Cup 2022: మెరిసిన మిథాలీ, హర్మన్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం!

Womens World Cup 2022: India set Australia target of 278 after strong show with bat

ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 68‌తో పాటు యస్తిక భాటియా(83 బంతుల్లో 6 ఫోర్లతో 59), హర్మన్ ప్రీత్ కౌర్(47 బంతుల్లో 6 ఫోర్లతో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో పూజా వస్త్రాకర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) మెరుపులు మెరిపించింది.

దాంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్స్ స్మృతి మంధాన(10), షెఫాలీ వర్మ(12) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్స్ మూడు, అలన కింగ్ రెండు, జెస్స్ జొనాస్సెన్ ఓ వికెట్ తీసింది.

ఎన్నో అంచనాల మధ్య ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. బౌండరీతో జోరు కనబర్చిన స్మృతి మంధాన.. బ్రౌన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచింది. ఆ వెంటనే షెఫాలీ వర్మ సైతం క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరింది. దాంతో భారత్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా, మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డు పరుగెత్తించారు.

ఈ క్రమంలో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 130 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బ్రౌన్ విడదీసింది. యస్తికా భాటియాను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఆ కొద్దిసేపటికే సెంచరీ దిశగా వెళ్లిన మిథాలీ రాజ్ కింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటైంది. క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్, స్నేహ్ రాణా సైతం వరుసగా ఔటయ్యారు. పూజా వస్త్రాకర్ సాయంతో హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ ఇద్దరూ తమదైన శైలిలో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. ఇక పూజా వస్త్రాకర్ బాదిన రెండు సిక్స్‌లు ఇన్నింగ్స్‌కే హైలైట్.

Story first published: Saturday, March 19, 2022, 10:40 [IST]
Other articles published on Mar 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+