విజయం ముంగిట నిలబెట్టి..
28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హర్మన్‌ప్రీత్.. జెమీమాతో కలిసి ఆదుకుంది. నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత జెమీమా ఔటైనా... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును విజయం వైపు నడిపించింది. రిచా ఘోష్(14)తో కలిపి ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించింది. చివరి 26 బంతుల్లో భారత్ విజయానికి 40 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్ ఉండటంతో భారత్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే టీమిండియాను దురదృష్టం వెంటాడింది.

బద్దకంగా పరుగెత్తి..
ఆఫ్ స్టంప్ దిశగా వేసిన ఫుల్‌టాస్‌ను రిచా ఘోష్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడింది. కానీ బెత్ మూనీ సూపర్ డైవ్‌తో బంతిని ఆపి వికెట్ కీపర్‌కు వేగంగా బంతిని అందించింది. చాకచక్యంగా వ్యహరించిన కీపర్ అలీసా హీలీ.. హర్మన్‌ప్రీత్ క్రీజులో బ్యాట్ పెట్టలేదనే విషయాన్ని గ్రహించి వికెట్లను కొట్టేసింది. రన్ తీసేటప్పుడు బ్యాట్‌ను ముందుకు పెట్టి పరుగెత్తాలని, క్రీజులో ముందు పెట్టే ప్రయత్నం చేయాలనే బేసిక్ రూల్‌ను మరిచి క్యాజువల్‌గా పరుగెత్తిన హర్మన్ మూల్యం చెల్లించుకుంది. సరైన టైమ్‌కు క్రీజుకు చేరుకున్నా.. బ్యాట్ పెట్టలేకపోయింది. దాంతో రనౌట్‌గా వెనుదిరిగింది. అందరూ రనౌట్ కాదని భావించారు. కానీ రిప్లేలో హర్మన్ బ్యాట్ పెట్టలేదనే విషయం తెలిసి అవాక్కయ్యారు.

జీవితాంతం వెంటాడనున్న..
ఈ తప్పిదం హర్మన్‌ప్రీత్ కౌర్‌ను జీవితాంతం వెంటాడనుంది. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై మాట్లాడిన హర్మన్.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైంది. ముందుగా ఫీల్డింగ్‌లో ఘోర తప్పిదాలు చేసిన భారత మహిళల జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ తడబడి ఓటమికి తలవంచారు. మరోసారి నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. అయితే తీవ్ర జ్వరంతోనే హర్మన్‌ప్రీత్ ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. దాంతో కాస్త నీరసంగా కనిపించింది. ఆమె అనారోగ్యం కూడా రనౌటవ్వడానికి కారణమైంది.

అదరగొట్టిన బెత్ మూనీ, మెగ్ లానింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెత్ మూనీ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), మెగ్ లానింగ్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) చెలరేగారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీయగా..శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్(34బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 6 ఫోర్లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది.


Click it and Unblock the Notifications












