
గెబెరా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. శనివారం జరిగే గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సెమీఫైనల్ బెర్తు దాదాపు ఖారారు అవుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, వెస్టిండీస్‌లను మట్టికరిపించిన హర్మన్‌ప్రీత్ బృందం జోరు మీద ఉంది. అయితే ఇంగ్లండ్‌తో పోటీ అంత ఈజీ కాదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. టీమిండియా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి.
ఇంగ్లండ్ జట్టుపై ఆట తీరు మార్చుకోకపోతే ఓటమి ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది. పాకిస్థాన్, వెస్టిండీస్‌పై దీప్తిశర్మ, రిచాఘోష్ రాణించడంతో గట్టెక్కిన భారత్.. ఇంగ్లండ్‌పై గెలవాలంటే సమష్టిగా రాణించాల్సి ఉంది. ఏ ఒక్కరిద్దరి ప్రదర్శనతో గట్టెక్కాలంటే కుదరదు. ప్రతీ ప్లేయర్ సత్తా చాటాల్సిందే. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైఫల్యం ఆందోళనకరం.
వేలి గాయంతో పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరమైన స్మృతి మంధాన.. పూర్తిగా కోలుకుని వెస్టిండీస్‌తో బరిలోకి దిగింది. కానీ ఈ స్టార్ ఓపెనర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడినా.. వెస్టిండీస్ మ్యాచ్‌లో విఫలమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఆడపా దడపా ఇన్నింగ్స్‌లు ఆడినా.. ఆమె స్థాయికి తగ్గట్లు బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటి టైటిల్ అందించిన ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా ధాటిగా ఆడి శుభారంభాలు అందించాల్సిన అవసరం ఉంది.
ఫీల్డింగ్‌లోనూ చాలా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా క్యాచ్‌లు నేలపాలు చేయడం భారత్‌కు బలహీనతగా మారింది. ఈ విషయంలో చాలా మెరుగుపడాలి. మరోవైపు టీమిండియా మాదిరే తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. గ్రూప్-2లో భారత్-ఇంగ్లండ్ చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గి నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలక పోరుగా మారింది. గెలిచిన జట్టు దాదాపు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.