Women's T20 World Cup: టీమిండియా కొంపముంచిన జిడ్డు బ్యాటింగ్!

గాబెరా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా... జిడ్డు బ్యాటింగ్ టీమిండియా కొంపముంచింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో నాట్ సీవర్ ( 42 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అమీ జోన్స్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), హెదర్ నైట్ (28) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో రేణుక సింగ్(5/15) ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే(1/20) పొదుపుగా బౌలింగ్ చేసింది.

పేలవ బ్యాటింగ్‌తో..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన ( 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52) మెరిసినా... ఇతర బ్యాటర్లు ధాటిగా ఆడకపోవడంతో లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. చివర్లో రిచా ఘోష్ (34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 నాటౌట్) చేసిన ప్రయత్నం కూడా సరిపోలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో సారా గ్లెన్ (2/27), లారెన్ బెల్ (1/22), ఎకిల్‌స్టోన్ (1/14) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

ఐర్లాండ్‌తో గెలిస్తే..
విజయంలో కీలక పాత్ర పోషించిన నాట్ సీవర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. వరుసగా మూడో విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. మూడో ఓటమితో భారత్ క్లిష్టం చేసుకుంది. టీమిండియా చివరి లీగ్ మ్యాచ్‌లో సోమవారం ఐర్లాండ్‌తో తలపడనుంది. సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో హర్మన్ సేన తప్పక గెలవాలి.

జిడ్డు బ్యాటింగ్‌తో..
లక్ష్యచేధనలో టీమిండియా ధాటిగానే ఆరంభించినా.. మిడిలార్డర్ వైఫల్యం జట్టు ఓటమిని శాసించింది. కేథరిన్ ఓవర్లో స్మృతి నాలుగు బౌండరీలు బాదడంతో 3 ఓవర్లలో భారత్ 27 పరుగులు చేసింది. కానీ తర్వాతి ఓవర్లోనే షెఫాలి (8)ని బెల్ ఔట్ చేయడంతో భారత్ వికెట్ల పతనం మొదలైంది. స్మృతి క్రీజులోనే ఉన్నా ధాటిగా ఆడలేకపోయింది. జెమీమా (16 బంతుల్లో 13) కూడా విఫలమవడంతో 9 ఓవర్లలో భారత్ 57/1తో నిలిచింది.

మిడిలార్డర్ వైఫల్యం..
ఆ తర్వాత వరుస ఓవర్లలో జెమీమా, హర్మన్‌ప్రీత్ (4) ఔట్ కావడం జట్టుకు తీరని నష్టం చేసింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది. స్మృతి, రిచా కొన్ని మెరుపులు మెరిపించినా.. స్కోరు ధాటిగా రాలేదు. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడం.. 16వ ఓవర్ చివరి బంతికి స్మృతి ఔటవ్వడంతో టీమిండియా కష్టాలు ఎక్కువయ్యాయి. చివరి నాలుగు ఓవర్లలో 47 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లడ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ను కొనసాగించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications