Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్ ముందు భారత్‌కు ఘోర పరాజయం!

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. మెగా టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 1-2తో కోల్పోయింది. మంగళవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(40 బంతుల్లో 7 ఫోర్లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. యస్తిక భాటియా(32), దీప్తి శర్మ(32), జెమీమా రోడ్రిగ్స్(29) పర్వాలేదనిపించారు. ఓపెనర్లు స్మృతి మంధాన(8), షెఫాలీ వర్మ(11) తీవ్రంగా నిరాశపర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీయగా.. స్మిత్, చార్లీ డెన్ తలో వికెట్ పడగొట్టారు.

Womens T20 World Cup 2026 India Suffers 1-2 Series Defeat Against England in Crucial Warm-Up Clash

అనంతరం ఇంగ్లండ్ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 184 పరుగులు చేసి గెలుపొందింది. అలిస్ క్యాప్సే(43 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82), హీథర్ నైట్(42 బంతుల్లో 10 ఫోర్లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్ రెండేసి వికెట్లు తీసారు.

జూన్ 12 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జూన్ 14న ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్‌తో జూన్ 10న వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

మహిళల టీ20 ప్రపంచకప్ 2026 - టీమిండియా షెడ్యూల్:

జూన్ 14 (ఆదివారం): భారత్ వర్సెస్ పాకిస్తాన్ (ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్) - సాయంత్రం 7:00 గంటలకు

జూన్ 17 (బుధవారం): భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ (హెడింగ్లే, లీడ్స్) - సాయంత్రం 7:00 గంటలకు

జూన్ 21 (ఆదివారం): భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్) - సాయంత్రం 7:00 గంటలకు

జూన్ 25 (గురువారం): భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్) - సాయంత్రం 7:00 గంటలకు

జూన్ 28 (ఆదివారం): భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (లార్డ్స్, లండన్) - సాయంత్రం 7:00 గంటలకు

నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు:

జూన్ 30 (మంగళవారం): సెమీఫైనల్ 1 (ది ఓవల్, లండన్)

జూలై 2 (గురువారం): సెమీఫైనల్ 2 (ది ఓవల్, లండన్)

జూలై 5 (ఆదివారం): ఫైనల్ మ్యాచ్ (లార్డ్స్, లండన్)

Story first published: Wednesday, June 3, 2026, 9:22 [IST]
Other articles published on Jun 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+