Womens T20 World Cup 2026: ఇవాళ ఓడితే ఇంటికే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలతో మెగా టోర్నీని ఘనంగా ప్రారంభించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. సౌతాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో ఒక్కసారిగా తమ పరిస్థితిని కాస్త సంక్లిష్టంగా మార్చుకుంది. నేడు(గురువారం) రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే తమ తర్వాతి పోరులో హర్మన్‌సేన.. బలహీనమైన బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే జట్టు సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.
ఈ మ్యాచ్‌లో గెలవడమే కాకుండా నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకోవడం హర్మన్‌సేనకు కీలకం. ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో 20-3 రికార్డుతో భారత్‌దే పైచేయి అయినా.. ఉదాసీనత కనబరిస్తే బంగ్లాదేశ్ షాక్ ఇవ్వగలదు. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్ జోరు మీదుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన 150కి పైగా స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

జెమీమా, హర్మన్, యస్తిక కూడా బ్యాట్ ఝులిపిస్తే భారత్‌కు తిరుగుండదు.3 మ్యాచ్‌ల్లో కలిపి జెమీమా 32 పరుగులే చేయడం టీమిండియాను కలవరపెడుతోంది. లోయార్డర్‌లో రిచా ఘోష్ దూకుడుగా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్‌లో నిరాశపర్చిన అరంగేట్ర స్పిన్నర్ ప్రేమ రావత్‌పై వేటుపడే అవకాశం ఉంది. ఆమె స్థానంలో రాధా యాదవ్ బరిలోకి దిగవచ్చు. పేసర్ క్రాంతి గౌడ్‌ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. తెలుగు తేజం శ్రీచరణి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.
భారత్‌తో గ్రూప్-1లో ఉన్న ఆసీస్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా మధ్య పోటీ నెలకొంది. సౌతాఫ్రికా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌తో మాత్రమే ఆడాల్సి ఉండగా.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి ఉంది. కాబట్టి బంగ్లాదేశ్‌పై మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తేనే టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

