Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 World Cup 2024: టాస్ ఓడిన భారత్.. తెలుగు అమ్మాయికి చోటు!

మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ సారథి సోఫి డివైన్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ వికెట్‌లో ఏ మాత్రం మార్పు ఉండదని చెప్పింది. న్యూజిలాండ్ టీమ్ సూపర్ ఫామ్‌లో ఉందని, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చింది.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ముందుగా ఫీల్డింగ్ చేయడంపై తమకు ఎలాంటి సమస్య లేదని టీమిండియా కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. వాతావరణం చల్లగా ఉన్నందున సెకండ్ బ్యాటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పింది. తమ ప్లేయర్లు ఫియర్‌లెస్ బ్యాటర్లని, దూకుడుగా ఆడుతామని చెప్పింది.

Women s T20 World Cup 2024 NZ-W wins toss and opts to bat first vs IND-W in Dubai

అంతేకాకుండా తమ జట్టు సమతూకంగా ఉందని, తమ ఆటను ఆస్వాదిస్తామని తెలిపింది. ముగ్గురు పేసర్లతో కూడిన బౌలింగ్ విభాగానికి అరుంధతి రెడ్డి కూడా తోడైందని, లెగ్ స్పిన్నర్ ఆశా సోభనా కూడా చోటు దక్కించుకుందని పేర్కొంది.

తుది జట్లు:

భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, ఆశా సోభనా, రేణుక సింగ్

న్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియో ప్లిమ్మర్, అమెలియా కేర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాల్లిడే, మ్యాడ్డీ గ్రీన్, ఇసాబెల్లా గేజ్(కీపర్), జెస్ కేర్ర్, రోస్‌మేరీ మైర్, లీ టాహుహు, ఈడెన్ కార్సన్

Story first published: Friday, October 4, 2024, 20:21 [IST]
Other articles published on Oct 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+