మహిళల టీ20 ప్రపంచకప్ 2024ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలై తీవ్రంగా నిరాశపరిచింది. న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. బ్యాటర్ల దారుణ వైఫల్యం టీమిండియా ఓటమికి కారణమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. కెప్టెన్ సోఫీ డివైన్(36 బంతుల్లో 7 ఫోర్లతో 57 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. జార్జియో ప్లిమ్మర్(23 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) వేగంగా ఆడింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(2/27) రెండు వికెట్లు తీయగా.. అరుందతి రెడ్డి, ఆశా సోభనా తలో వికెట్ తీసారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు అనూహ్యంగా 102 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు స్మృతి మంధానా(12), ఫెఫాలీ వర్మ(2)తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15), జెమీ రోడ్రిగ్స్(13), రిచా ఘోష్(12), దీప్తి శర్మ(13) దారుణంగా విఫలమయ్యారు. తెలుగు తేజం అరుందతి రెడ్డి(1) కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. పూర్తి ఓవర్లు కూడా ఆడకుండా 19 ఓవర్లలోనే ఆలౌటయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో రోస్‌మేరీ మైర్(4/19) నాలుగు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. లీ తహుహు(3/15) మూడు వికెట్లు పడగొట్టింది. ఈడెన్ కార్సన్‌కు రెండు వికెట్లు .. అమెలియా కేర్‌కు ఓవికెట్ దక్కింది. ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయంతో ప్రపంచకప్ గెలుస్తారనే అశలే అడియాశలయ్యాయి.