Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens T20 World Cup 2023: జేమీమా ధమాకా.. పాక్‌పై రికార్డు సృష్టించిన భారత్!

Womens T20 World Cup 2023: India chased highest total in the history of T20 WC after beat Pakistan

కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్‌-2 పోరులో సమష్టిగా రాణించి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది.

కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ ( 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 నాటౌట్‌) అజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. అయేషా నసీమ్‌ ( 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్‌) ధనాధన్‌ బ్యాటింగ్‌తో మెరిసింది. భారత బౌలర్లలో రాధ యాదవ్‌ (2/21) రాణించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

రికార్డు విజయం..

రికార్డు విజయం..

రిచా ఘోష్‌ (20 బంతుల్లో 5 ఫోర్లు, 31 నాటౌట్‌)తో కలిసి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' జెమీమా రోడ్రిగ్స్‌ (38 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్‌) జట్టును గెలిపించింది. ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 58 పరుగులు జతచేసింది. షెఫాలీ వర్మ ( 25 బంతుల్లో 4 ఫోర్లతో 33) కూడా మెరిసింది. పాక్‌ బౌలర్లలో నష్రా సంధు (2/15) రాణించింది. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక పరుగుల చేజింగ్. ఓవరాల్‌గా సెకండ్ హయ్యెస్ట్ చేజింగ్. 2009లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 164 రన్స్ చేసి టాప్‌లో ఉంది.

భారత్‌ రెండో మ్యాచ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో తలపడుతుంది.

ఊపిరి సలపని ఉత్కంట..

ఊపిరి సలపని ఉత్కంట..

భారత్-పాకిస్థాన్ పోరు అంటే ఉండే అన్నీ ఎమోషన్స్, టెన్షన్స్ ఈ మ్యాచ్‌లో కనిపించాయి. మరో ఓవర్‌ మిగిలి ఉండగానే భారత్‌ గెలిచినా.. బంతి బంతికి.. పరుగు పరుగుకి ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. పాక్‌ బౌలర్లు గొప్పగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. స్మృతి మంధాన వేలి గాయంతో దూరమవడంతో షెఫాలీ వర్మతో కలిసి యాస్తిక (17) ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓ ఎండ్‌లో షెఫాలీ ఎప్పటిలాగే ఫోర్ల వేటలో సాగింది. కానీ యాస్తిక నిలబడలేకపోయింది. దీంతో పవర్ ప్లేలో భారత్‌ 43/1తో నిలిచింది. ఆ తర్వాత జెమీమా జతగా షెఫాలీ ఇన్నింగ్స్‌ నడిపించింది. ఏడో ఓవర్లో ఏడు బంతులు వేయగా.. చివరి బంతికి ఫోర్‌తో జెమీమా బౌండరీ ఖాతా తెరిచింది. స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. పేసర్ల ఓవర్లలో స్వేచ్ఛగా పరుగులు సాధించింది.

స్టన్నింగ్ క్యాచ్‌తో..

స్టన్నింగ్ క్యాచ్‌తో..

9 ఓవర్లకు 65/1తో భారత్‌ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుందనిపించింది. కానీ ఆ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే బౌండరీ లైన్‌ దగ్గర సిద్రా తనను తాను నియంత్రించుకుని పట్టిన సూపర్‌ క్యాచ్‌తో షెఫాలీ నిష్క్రమించింది. రెండు ఫోర్లతో అలరించిన కెప్టెన్‌ హర్మన్‌ (16) త్వరగానే వెనుదిరిగింది. విజయం కోసం 36 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ రేకెత్తింది. జెమీమా, రిచా ఎంత ప్రయత్నించినా ఆ తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 14 పరుగులే వచ్చాయి. దీంతో సమీకరణం 24 బంతుల్లో 41 పరుగులుగా మారింది. ఓవర్‌కు 10కి పైగా రన్‌రేట్‌తో పరుగులు సాధించాల్సి రావడంతో భారత్‌కు కష్టమేననిపించింది.

కోహ్లీ ఇన్నింగ్స్ తరహాలో..

కోహ్లీ ఇన్నింగ్స్ తరహాలో..

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఆసాధారణ ఇన్నింగ్స్‌ను తలపిస్తూ జెమీమా చెలరేగింది. 17వ ఓవర్లో జెమీమా, రిచా చెరో ఫోర్‌ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. భారీ షాట్లను అలవోకగా ఆడగలిగే రిచా.. ఆ తర్వాతి ఓవర్లో హ్యాట్రిక్‌ ఫోర్లతో కథ మలుపు తిప్పింది. ఆ ఓవర్లో మొత్తం 14 పరుగులు రావడంతో జట్టు గెలుపునకు 12 బంతుల్లో 14 పరుగులు కావాల్సి వచ్చింది. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచిన జెమీమా 19వ ఓవర్లో మూడు ఫోర్లతో పని పూర్తి చేసింది. రెండో బంతికి ఆఫ్‌సైడ్‌ జరిగి స్క్వేర్‌లెగ్‌లో బౌండరీ సాధించి ఒత్తిడి తగ్గించుకున్న ఆమె.. చివరి రెండు బంతులకు ఫోర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు అర్ధశతకాన్ని చేరుకుంది.

Story first published: Monday, February 13, 2023, 8:04 [IST]
Other articles published on Feb 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+