Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens ODI World Cup 2022: ఆకట్టుకున్న సూపర్ మామ్.. మూన్ బాల్‌తో బెంబేలెత్తించిన బౌలర్(వీడియో)

Womens ODI World Cup 2022: Australia Pacer Nicola Carey bowls a moonball against Pakistan

మౌంట్‌మాంగనీ: న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెగా టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ నికోలా కారీ మూన్‌బాల్‌తో బెంబేలెత్తించింది. ఆమె వేసిన ఈ బంతికి మైదానంలోని ప్లేయర్లతో పాటు టీవీల ముందున్న ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు.

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ సందర్భంగా 45వ ఓవర్‌‌లో కారీ నాలుగో బంతి వేస్తుండగా జారిపోయింది. దాంతో బంతి బ్యాటర్ తలపై నుంచి హై ఫుల్‌టాస్‌గా కీపర్‌కు అందకుండా వెళ్లింది. వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఎంత ప్రయత్నించినా బంతి చేతికి చిక్కలేదు. దీంతో అంపైర్‌ ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించగా.. పాక్ బ్యాటర్స్ రెండు పరుగులు తీసారు.

మూన్ బాల్...

ఈ బంతి కారణంగా మైదానంలో నవ్వులు పూసాయి. ఇదెక్కడి బౌలింగ్‌ అమ్మా అంటూ ఆటగాళ్లు విచిత్ర ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. దాంతో కారీ నవ్వుకుంటూ మరో బంతి వేయడానికి సిద్దమైంది. ఇక మరుసటి ఫ్రీ హిట్‌ బాల్‌కు పాకిస్థాన్ కెప్టెన్, సూపర్ మామ్ బిస్మా మరూఫ్ సింగిల్ మాత్రమే తీసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచకప్‌లో మూన్ బాల్ కనిపించిందంటూ ఐసీసీ ఈ వీడియోను అభిమానులతో పంచుకుంది. బౌలర్‌ వేసే బంతి ఎక్కువ ఎత్తుకు వెళ్లి కీపర్‌కు కూడా అందకపోతే దాన్ని మూన్‌ బాల్‌గా పరిగణిస్తారు.

ఆసీస్ ఘన విజయం..

ఆసీస్ ఘన విజయం..

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్(122 బంతుల్లో 8 ఫోర్లతో 78 నాటౌట్), అలియా రైజ్(109 బంతుల్లో 4 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో అలన్ కింగ్ రెండు వికెట్లు తీయగా.. మెఘన్ స్కట్, ఎల్లిస్ పెర్రీ, వెల్లింగ్టన్, క్యారీ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 34.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్‌ అలీసా హీలీ(72), మెగ్‌ లానింగ్‌(35) టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

సూపర్ మామ్..

సూపర్ మామ్..

పాకిస్థాన్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నా.. ఆ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్‌ను యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చకుంటుంది. ఎందుకంటే.. ఇటీవలే తల్లి అయిన ఆమె తన పండంటి బిడ్డతోనే ఈ మెగాటోర్నీలో పాక్ జట్టును నడిపిస్తోంది. తన కూతురు ఫాతిమాను తీసుకుని మారుఫ్ ప్రపంచకప్‌ ఆడేందుకు వచ్చింది.

ఓ వైపు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు కెప్టెన్‌గా మైదానంలో పాక్ జట్టును నడిపిస్తున్న మారూఫ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బిస్మా మరూఫ్ గతేడాది ఆగస్టులో ఫాతిమాకు జన్మనిచ్చింది. ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఫాతిమాను కూడా తీసుకువెళ్లేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బిస్మా మరూఫ్‌కు అనుమతి ఇచ్చింది. దాంతో నెటిజన్లు మరూఫ్‌ను సూపర్ మామ్ అంటూ కొనియాడుతున్నారు.

Story first published: Tuesday, March 8, 2022, 16:11 [IST]
Other articles published on Mar 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+