
ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు..
ఐదు జట్లతో వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే లీగ్ ప్రారంభానికి ముందు జట్ల ఎంపిక, ఆటగాళ్ల వేలం వంటి ప్రక్రియపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఓ ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా.. బీసీసీఐ వర్గాల ప్రకారం త్వరలోనే టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కొత్త జట్లను ఎంపిక చేసినట్లే ఈవేలం ద్వారా ఫ్రాంచైజీల ఎంపిక ప్రక్రియను ముగించనుంది.

ముంబై ఇండియన్స్ కొన్న ధరతో..
2008లో తొలి ఐపీఎల్ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. రూ.400 కోట్లకు పైగా ఎవరు ఎక్కువ కోట్ చేస్తే.. వారికి ఫ్రాంచైజీలు దక్కనున్నాయి.

ఐదేళ్లలో చెల్లించాలి..
ఈ వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. ప్రస్తుతం మెన్స్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఓనర్లకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఈ విషయంలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, అమెరికాలో వుమెన్స్ ఎన్‌బీఏలను పరిగణనలోకి తీసుకుంటోంది.

ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆసక్తి..
ఈపీఎల్ మహిళల కోసం వుమెన్స్ సూపర్ లీగ్ ప్రారంభించగా.. అందులో మొత్తం 12 ఈపీఎల్ క్లబ్ ఓనర్లే ఈ టీమ్స్‌ను కొనుగోలు చేశారు. ఇక అమెరికాలో వుమెన్స్ ఎన్‌బీఏలో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలకుగాను నాలుగు పురుషుల టీమ్స్ ఓనర్లే కొనుగోలు చేయగా.. మరో నాలుగు ఇతరులు చేశారు. మహిళల ఐపీఎల్ జట్లు కొనేందుకు పురుషుల ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీదేశీ లీగ్స్‌లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మహిళల ఫ్రాంచైజీలు చేజిక్కించుకునేందుకు కసరత్తులు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications
