Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేటి నుంచే మహిళల ఆసియా కప్.. భారత్ X పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

ఆసియా మహిళల టీ20 టోర్నీకి సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా శుక్రవారం ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో పాటు భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

ఇప్పటి వరకు ఆసియాకప్‌ను భారత్ ఏడుసార్లు గెలుచుకుంది. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు గెలిచిన భారత్.. టీ20 ఫార్మాట్‌లో మూడు సార్లు(2012, 2016, 2022) విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 9 గెలిచిన భారత్‌ టైటిల్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై గెలిచి భారత్ జోరు మీద ఉంది.

ఫాలో-ఆన్ నిర్ణయం వల్ల కాదు.. వారి వల్లే విజయం దక్కలేదు: శుభ్‌మన్ గిల్

ఫాలో-ఆన్ నిర్ణయం వల్ల కాదు.. వారి వల్లే విజయం దక్కలేదు: శుభ్‌మన్ గిల్

ఫార్మాట్ ఏంటంటే..?

ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూప్స్‌గా విభజించారు. పాకిస్థాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్‌తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉండగా.. బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక, యూఏఈ గ్రూప్-బీలో ఆడనున్నాయి. గ్రూప్ దశలో ప్రతీ టీమ్‌ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్ రెండు టీమ్స్‌ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Womens Asia Cup 2026 India vs Pakistan Match Date Schedule Broadcast and Format Explained

సెప్టెంబర్‌ 5న పాకిస్థాన్‌తో భారత్ పోరు..

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ సెప్టెంబర్ 5న తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20ల్లో భారత్ 14 గెలిచి తిరుగులేని రికార్డ్‌తో ఉంది. పాకిస్థాన్ ఇటీవల టీ20ల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా వెస్టిండీస్, శ్రీలంకలపై సిరీస్‌లు కోల్పోయింది. టీ20 ప్రపంచకప్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు ఓడింది.

ఎలా చూడాలంటే..?

ఆసియా కప్ మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు మొదలవ్వనుండగా.. ఈ టోర్నీకి సోనీ స్పోర్ట్స్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ టీవీ ఛానెల్స్‌తో పాటు సోనీ లీవ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

భారత్ షెడ్యూల్..

ఆగస్టు 30: భారత్ vs థాయిలాండ్ (రాత్రి 8 గంటలకు, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)

సెప్టెంబర్ 03: భారత్ vs హాంగ్ కాంగ్ (రాత్రి 8 గంటలకు, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)

సెప్టెంబర్ 05: భారత్ vs పాకిస్థాన్ (రాత్రి 8 గంటలకు, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)

IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!

Also Read

IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!

నాకౌట్ షెడ్యూల్..

సెప్టెంబర్ 10: సెమీఫైనల్-1 (రాత్రి 8 గంటలకు, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)

సెప్టెంబర్ 11: సెమీఫైనల్-2 (రాత్రి 8 గంటలకు, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)

సెప్టెంబర్ 13: ఫైనల్ (రాత్రి 8 గంటలకు, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)

Story first published: Friday, August 28, 2026, 10:47 [IST]
Other articles published on Aug 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+