For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Womens Asia Cup 2022: మహిళల క్రికెట్‌లో థాయ్‌లాండ్ సంచలనం!

Womens Asia Cup 2022: Thailand beats Pakistan in League Match

సిల్లేట్: మహిళల క్రికెట్‌లో థాయ్‌లాండ్ సంచలనం సృష్టించింది. మహిళల ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ మహిళలు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 116 పరుగులు చేసింది. సిద్రా అమీన్(64 బంతుల్లో 6 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగత బ్యాటర్లు విఫలమయ్యారు. థాయ్‌లాండ్ బౌలర్లో సోర్నారిన్ రెండు వికెట్లు తీయగా.. తిపట్చా ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన థాయ్‌లాండ్ మహిళల జట్టు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నత్తకన్ చంతమ్(61) హాఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ బౌలర్లలో నిదా దర్, టుబా హస్సన్ రెండేసి వికెట్లు తీయగా.. నష్రా సంధు, కైనత్ ఇమ్తియాజ్ తలో వికెట్ తీసారు. మహిళల క్రికెట్‌లో థాయ్‌లాండ్‌కు ఇదే అతిపెద్ద విజయం.

పాయిట్స్‌ టేబుల్‌లో మూడు విజయాలు నమోదు చేసిన భారత మహిళల జట్టు అగ్రస్థానంలో ఉండగా..2 విజయాలతో పాకిస్థాన్ మహిళల జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. థాయ్‌లాండ్ తొలి విజయంతో పాయింట్ల ఖాతా తెరిచి ఐదో స్థానంలో నిలిచింది.

Story first published: Thursday, October 6, 2022, 12:29 [IST]
Other articles published on Oct 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+