Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: భారత్‌దే బ్యాటింగ్.. పవర్ హిట్టర్ రీఎంట్రీ!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. డ్యూ వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నామని తెలిపింది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ రేసులో నిలవాలని భావిస్తున్నామని పేర్కొంది.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. తాము ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పింది. 'పిచ్ చాలా బాగుంది. ముందుగా బ్యాటింగ్ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం.

Women s World Cup 2025 Jemimah Rodrigues Replaces Amanjot Kaur as India Opt to Bat First Against New Zealand

ఈ రోజు మేం అదనపు బ్యాటర్‌ను తీసుకున్నాం. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. గత మూడు మ్యాచ్‌ల్లో మేం చివరి నిమిషంలో విజయాన్ని చేజార్చుకున్నాం. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంటాం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. అమన్ జోత్ స్థానంలో జెమీమా రీఎంట్రీ ఇచ్చింది.

తుది జట్లు:

భారత్: ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

న్యూజిలాండ్: సూజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్ (కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్ (వికెట్ కీపర్), జెస్ కెర్, రోజ్మేరీ మైర్, లీ తాహుహు, ఈడెన్ కార్సన్.

Story first published: Thursday, October 23, 2025, 15:42 [IST]
Other articles published on Oct 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+