Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీఫైనల్ చేరాలంటే?

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. దాంతో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన హర్మన్‌సేనకు ఊహించని షాక్ తగిలింది. టాపార్డర్ వైఫల్యం.. పేలవ డేత్ బౌలింగ్‌ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓటమితో టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి పడిపోయింది.

అయితే టీమిండియా తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో పటిష్టమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో ఉన్న జట్లే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ క్రమంలో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే తమ తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలవాలి. రెండు మ్యాచ్‌లు ఓడినా.. సెమీఫైనల్ సమీకరణాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది.

Women s World Cup 2025 How India Can Still Qualify for the Semi-Finals After Defeat to South Africa

ఆఖరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. మరో అవకాశం లేకుండా టీమిండియా ఇంటిబాట పడుతుంది. ఈ క్రమంలోనే కనీసం మూడు మ్యాచ్‌లు గెలవాలి. అయితే బంగ్లాదేశ్ మినహా మూడు జట్లు టీమిండియాకు కఠినమైనవే. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం టీమిండియా మరింత నైరాశ్యంలోకి వెళ్తుంది.

ఏ ఒక్కరి ప్రదర్శనపైన ఆధారపడకుండా సమష్టిగా రాణిస్తేనే టీమిండియాకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, ప్రతికా రావల్, జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. లోయారార్డర్‌లో రిచా ఘోష్ సూపర్ ఫామ్‌లో ఉండటం, రిచా ఘోష్, స్నేహ్ రాణా రాణిస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. గత మూడు మ్యాచ్‌ల్లో లోయారార్డర్ రాణించడంతోనే టీమిండియా పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. టాపార్డర్ కూడా చెలరేగితే భారీ స్కోర్లు నమోదవుతాయి.

బౌలింగ్ బాగానే ఉన్నా.. పూర్తిగా స్పిన్నర్లపైనే ఆధారపడుతున్నారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా ఓవర్ల కోటా పూర్తి కావడంతో మిగతా బౌలర్లు ఒత్తిడికి గురయ్యారు. డెత్ ఓవర్లలో క్రాంతి గౌడ్, అమన్ జోత్ ధారళంగా పరుగులిచ్చుకున్నారు. స్పిన్నర్లతో పాటు పేసర్లు కూడా బాధ్యతగా రాణిస్తేనే హర్మన్‌సేనకు తిరుగుండదు. ఫీల్డింగ్ పరంగానూ భారత్‌కు తిరుగులేదు.

Story first published: Friday, October 10, 2025, 10:03 [IST]
Other articles published on Oct 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+