
అసలేం జరిగిందంటే..?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 27వ ఓవర్‌లో పాకిస్థాన్ బౌలర్ ఒమైమా సోహైల్ ఏడు బంతులు వేసింది. ఈ ఓవర్ చివరి బంతికి సఫారీ బ్యాటర్ సునే లూస్ ఎల్బీగా ఔటైంది. ఇక అంపైర్ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన సునే లూస్.. ఫలితాన్ని రాబట్టింది. తన నిర్ణయం తప్పుగా తేలడంతో కొంత గందరగోళానికి గురైన ఫీల్డ్ అంపైర్.. బౌలర్ వేసిన బంతుల సంఖ్యను మరిచిపోయాడు. దాంతో మరో బంతిని వేయించాడు. అదనపు బంతికి సౌతాఫ్రికా సింగిల్ తీసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అంపైర్ ఇలా ఘోర తప్పిదంపై చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇంత అలసత్వమా?
ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఇలాంటి తప్పిదాలు చేస్తే ఎలా? క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆ సింగిల్ ఫలితాన్ని నిర్దేశించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని, అంపైర్ జాబ్ పోయేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదృష్టం బాగుండి అంపైర్ బతికిపోయాడని లేకుంటే అతని కెరీరే ముగిసేదంటున్నారు. ప్రస్తుతం ఈ ఓవర్‌కు సంబంధించిన స్కోర్ కార్డ్ స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

పాక్ ఓటమి..
ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఆ జట్టులో వోల్వార్డ్ట్(75), లూస్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 217 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు.

సెమీస్ ఆశలు గల్లంతు..
ఇక వరుసగా మూడు ఓటములతో పాకిస్థాన్ మహిళలు సెమీస్ ఆశలు గల్లంతు చేసుకున్నారు. పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్ధానంలో నిలిచిన పాకిస్తాన్.. తమ తదుపరి మ్యాచ్‌ను మార్చి14న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. భారత జట్టుతో తొలి మ్యాచ్ ఓడిన పాకిస్థాన్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఓటమిపాలైంది. తాజాగా సఫారీ ఓటమితో మెగాటోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి తెచ్చుకుంది. ఇక పాక్‌పై గెలిచిన భారత్.. న్యూజిలాండ్ చేతిలో చిత్తయ్యింది. శనివారం విండీస్ మహిళలతో అమీతుమీ తేల్చుకోనుంది.


Click it and Unblock the Notifications












