Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's World Cup 2022: ఎలా చూడాలంటే..? టైమింగ్స్, చానెల్స్, లైవ్ స్ట్రీమ్ వివరాలు! ప్రైజ్‌మనీ ఎంతంటే?

 Womens World Cup 2022: Prize money, live stream and TV channel details

హైదరాబాద్: క్రికెట్‌లో మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా జరగబోతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ పోరుకు రేపటి(శుక్రవారం)తో తెర లేవనుంది. న్యూజిలాండ్‌ వేదికగా ఎనిమిది జట్లు 31 రోజుల పాటు తమ సత్తాను చాటేందుకు సన్నద్ధమయ్యాయి. మహిళల క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు ఆతిథ్య కివీస్‌ కూడా తమ వరల్డ్‌కప్‌ విజయాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతుండగా... భారత్‌ సహా మిగిలిన ఐదు జట్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయనేది ఆసక్తికరం.

 ర్యాంకింగ్స్‌తో..

ర్యాంకింగ్స్‌తో..

ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్‌ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్‌ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మిగిలిన మూడు స్థానాలను క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా... కోవిడ్‌ ప్రభావంతో ఆ టోర్నీ రద్దయింది. దాంతో మళ్లీ వన్డే ర్యాంకింగ్‌ ప్రకారమే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. క్వాలిఫయింగ్‌లో పోరాడేందుకు సిద్ధమైన శ్రీలంక జట్టు వరల్డ్‌కప్‌ అవకాశం కోల్పోయింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పాల్గొనడం ఇదే తొలిసారి.

 31 మ్యాచ్‌లు.. 6 వేదికలు..

31 మ్యాచ్‌లు.. 6 వేదికలు..

మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు మొత్తం 31 మ్యాచ్‌లు 6 వేదికల్లో నిర్వహిస్తారు. మౌంట్ మాంగనియా(బే ఓవల్), డునెడిన్(యూనివర్సిటీ ఓవల్), హామిల్టన్(సీడన్ పార్క్), వెల్లింగ్టన్ (బెసిన్ రిజర్వ్), ఆక్లాండ్(ఈడెన్ పార్క్), క్రైస్ట్ చర్చ్(హగ్లే ఓవల్) వేదికలను మెగాటోర్నీ కోసం ఖారారు చేశారు. ఏప్రిల్‌ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఇప్పటి వరకు మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 11 సార్లు జరగ్గా... ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లండ్‌ 4 సార్లు, న్యూజిలాండ్‌ ఒకసారి విజేతగా నిలిచాయి.

ప్రైజ్‌మనీ ఎంతంటే:

ప్రైజ్‌మనీ ఎంతంటే:

2017 కంటే ఈసారి ప్రైజ్‌మనీని రెట్టింపు చేశారు. విజేతకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్‌ జట్టుకు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 54 లక్షలు), సెమీస్‌లో ఓడిన జట్లకు 3 లక్షల డాలర్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) చొప్పున లభిస్తాయి. ప్రతీ టీమ్‌ మిగిలిన ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్లపరంగా రెండు జట్లు సమంగా నిలిస్తే రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. లీగ్‌ దశలో 'టై' మ్యాచ్‌లకు చెరో పాయింట్‌ కేటాయిస్తారు. అయితే సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాత్రం 'సూపర్‌ ఓవర్‌' ఉంది. సూపర్‌ ఓవర్‌ కూడా సమమైతే ఫలితం తేలే వరకు మళ్లీ మళ్లీ ఆడిస్తారు. ఈ సారి లీగ్‌ దశ నుంచి కూడా అన్ని మ్యాచ్‌లలో 'డీఆర్‌ఎస్‌' అమల్లో ఉంటుంది.

చానెల్స్, స్ట్రీమింగ్ వివరాలు..

చానెల్స్, స్ట్రీమింగ్ వివరాలు..

భారత కాలమానం ప్రకారం అన్ని మ్యాచ్‌‌లు ఉ. 6.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ బీసీసీఐ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తమకు చెందిన తెలుగు, తమిళం, కన్నడం, హిందీ బాషాల్లోనూ ప్రత్యక్షప్రసారం చేయనుంది. ఇక స్టార్ నెట్‌వర్క్‌కే చెందిన డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అన్ని భాషాల్లో కామెంట్రీ అందుబాటులో ఉంది.

Story first published: Thursday, March 3, 2022, 13:14 [IST]
Other articles published on Mar 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+