Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 WC: టీమిండియాను వెంటాడుతున్న దురదృష్టం.. బ్యాట్‌ను నేలకు కొట్టిన హర్మన్‌

Womens T20 World Cup: Harmanpreet Kaur Throws Away Her Bat In Frustration After Bizarre Run Out

న్యూఢిల్లీ: కీలక మ్యాచ్‌ల్లో టీమిండియాను దురదృష్టం వెంటాడుతోంది. పురుషుల క్రికెట్ అయినా.. మహిళలు అయినా కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు కలిసి రావడం లేదు. పురుషుల 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లోనూ.. తాజాగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ టీమిండియాను రనౌట్ రూపంలో దురదృష్టం వెంటాడింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో మహేంద్ర సింగ్ ధోనీ మిల్లీ మీటర్ దూరంలో రనౌటవ్వడం.. భారత్ ఓటమిపాలవ్వడం ఏ క్రికెట్ అభిమాని మరిచిపోడు. ఆ సమయంలో ధోనీ, లెగ్ అంపైర్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.

అప్పుడు.. ఇప్పుడు అదే దురదృష్టం..

అప్పుడు.. ఇప్పుడు అదే దురదృష్టం..

తాజా టీ20 ప్రపంచకప్‌లోనూ మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియాను రనౌటే కొంపముంచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెత్‌ మూనీ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), మెగ్‌ లానింగ్‌(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్)‌ చెలరేగారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీయగా..శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది.

హర్మన్ మెరిసినా..

హర్మన్ మెరిసినా..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్(34బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 6 ఫోర్లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది. అయితే కీలక సమయంలో హర్మన్‌ప్రీత్ రనౌటవ్వడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హర్మన్‌ప్రీత్.. జెమీమాతో కలిసి ఆదుకుంది. నాలుగో వికెట్‌కు 69 పరుగులు జోడించిన తర్వాత జెమీమా ఔటైనా... హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని జట్టును విజయం వైపు నడిపించింది. రిచా ఘోష్(14)తో కలిపి ఐదో వికెట్‌కు 36 పరుగులు జోడించింది.

వెంటాడిన దురదృష్టం..

చివరి 26 బంతుల్లో భారత్ విజయానికి 40 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్ ఉండటంతో భారత్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అప్పుడే టీమిండియాను దురదృష్టం వెంటాడింది. ఆఫ్ స్టంప్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడి క్విక్ డబుల్ తీసే ప్రయత్నం చేసింది. కానీ డీప్‌లో సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్న బెత్ మూనీ.. వికెట్లకు విసిరేయగా.. రనౌటైంది. హర్మన్‌ క్రీజులో బ్యాట్ పెట్టే ప్రయత్నం చేయకపోవడం రనౌట్‌కు కారణమైంది. దాంతో తీవ్ర అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్ బ్యాట్‌ను నేలకు కొట్టింది. ఈ రనౌట్‌ను ఆమె జీర్ణించుకోలేకపోయింది.

హర్మన్ గనుక రనౌట్ కాకుంటే టీమిండియా సులువుగా గెలిచేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్‌ ఒకేలా ఔటయ్యారని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, February 24, 2023, 9:49 [IST]
Other articles published on Feb 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+