Women's T20 WC: కీలక సెమీస్ ముందు టీమిండియాకు గట్టి షాక్.. కెప్టెన్‌తో పాటు స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత!

న్యూఢిల్లీ: ప్రపంచకప్ కలను సాకారం చేసుకోవాలన్న సంకల్ప బలంతో.. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలనే ధ్యేయంతో.. టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన భారత మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. నేడు(గురువారం) ఆస్ట్రేలియా జట్టుతో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న సెమీఫైనల్ మ్యాచ్‌కు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్లార్ ప్లేయర్ పూజా వస్త్రాకర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. కీలక మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యం నుంచి కోలుకోకపోతే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి.

ఆసుపత్రిలో చేరిన హర్మన్‌ప్రీత్..
అనారోగ్యానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌కు ముందే హర్మన్‌ప్రీత్ కౌర్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో అలానే బరిలోకి దిగిందని సమాచారం. సెమీ ఫైనల్‌కి ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రాక్టీస్ సెషన్లలోనూ పాల్గొనలేదని సౌతాఫ్రికా మీడియా పేర్కొంది. గురువారం ఆమె పరిస్థితి తీవ్రం కావడంతో తప్పని పరిస్థితుల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

మరో ఇద్దరు కూడా..
మరోవైపు పుజావస్త్రాకర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరితో పాటు భారత స్పిన్నర్ రాధా యాదవ్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రాధా యాదవ్, సెమీ ఫైనల్ సమయానికి టీమ్‌తో కలుస్తుందా? అనేది కూడా సందేహంగా మారింది. రాధా యాదవ్‌కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. తను కూడా దూరమైతే టీమిండియాకు మరిన్ని కష్టాలు తప్పవు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 87 పరుగులు చేసిన స్మృతి మంధాన, ఈ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

ఆసీస్ పని మరింత సులువు..
టీమిండియాపై ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఇరుజట్ల మధ్య 30 మ్యాచులు జరగగా 22 మ్యాచుల్లో ఆస్ట్రేలియానే గెలుపొందింది. 7 మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించింది. ఓ మ్యాచ్ మాత్రం ఫలితం తేలకుండానే రద్దయ్యింది. గత రికార్డులు, గణాంకాలు, ప్రదర్శన, చరిత్ర ఇలా ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టే ఫేవరెట్. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. 2009లో జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మినహా మిగతా ఆరుసార్లు ఆ జట్టే ఫైనల్ చేరింది. అందులోనూ 2010 సెమీస్‌లో భారత్‌పై గెలిచింది. మరోవైపు ఈ టోర్నీ చరిత్రలో ఐదోసారి సెమీస్ ఆడుతున్న భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications