Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 Challenge: హర్మన్‌సేన శుభారంభం.. స్మృతికి తప్పని పరాజయం!

Supernovas beat trailblazers by 49 runs

పుణే: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ శుభారంభం చేసింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రైల్‌బ్రేజర్స్‌తో సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సూపర్ నోవాస్ 49 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది.

ఓపెనర్లు ప్రియా పూనియా(22), డియాండ్ర డాటిన్(32) ధాటిగా ఆడి మంచి శుభారంభం అందివ్వగా.. హర్లీన్ డియోల్(35), హర్మన్ ప్రీత్ కౌర్(37) అదే జోరును కొనసాగించారు. దాంతో 11.1 ఓవర్లలోనే సూపర్ నోవాస్ 100 పరుగులు చేసింది. భారీ స్కోర్ దిశగా సాగింది. కానీ హర్మన్ ప్రీత్ రనౌటవ్వడంతో ధాటిగా ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ట్రైల్‌బ్లేజర్స్ బౌలర్లలో హీలీ మాథ్యూస్ మూడు వికెట్లు తీయగా.. సల్మా ఖాటున్ రెండు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ట్రైల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ స్మృతి మంధాన(34), జెమీమా రోడ్రిగ్స్(24) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ఇతర బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు తీయగా.. సోఫీ, అలాన్ కింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మేఘన సింగ్‌కు ఓ వికెట్‌కు దక్కింది.

Story first published: Monday, May 23, 2022, 23:06 [IST]
Other articles published on May 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+