Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's T20 Challenge Final: స్మృతి మంధాన టీమ్‌దే బ్యాటింగ్.. ఇరు జట్లలో మార్పులు!

Women’s T20 Challenge Final

షార్జా: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో భాగంగా ట్రయల్ బ్లేజర్స్‌తో జరుగుతున్న టైటిల్ ఫైట్‌లో సూపర్ నోవాస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చేజింగ్ సులువనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ తెలిపింది. ఇక టాస్ ఓడిపోయినా పర్వాలేదని భారీ స్కోర్ చేసి అద్బుత బౌలింగ్‌తో విజయాన్నందుకుంటామని బ్లేజర్స్ సారథి స్మృతి మంధాన ధీమా వ్యక్తం చేసింది. ఇరు జట్లలో ఒక్కో మార్పు చోటు చేసుకుంది. ట్రయల్ బ్లేజర్స్‌లో హేమలత స్థానంలో నుజాత్ పర్వీన్ రాగా.. ప్రియా పునియా స్థానంలో పుజా వస్త్రాకర్ వచ్చింది.

పురుషులతో పాటు మహిళల క్రికెట్‌కు ప్రాధాన్యమిస్తూ బీసీసీఐ నిర్వహించిన ఈ మహిళల టీ20 చాలెంజ్ ఐపీఎల్ తరహాలోనే గ్రాండ్ సక్సెస్ అయింది. మూడు మ్యాచ్‌ల లీగ్ దశలో మూడు జట్లు ఒక్కో మ్యాచే గెలవగా.. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్ నోవాస్, స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ ఫైనల్‌కు చేరాయి. ఇక నెట్ రన్‌ రేట్‌ తక్కువగా ఉండడంతో మిథాలీరాజ్‌ కెప్టెన్సీలోని వెలాసిటీ ఇంటిబాట పట్టింది.

వరుసగా మూడో టైటిల్‌పై హర్మన్‌ప్రీత్‌ సేన కన్నేయగా.. స్మృతి మంధాన జట్టు తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోంది. ఇప్పటివరకు 2018, 2019ల్లో మహిళల టీ20 చాలెంజ్‌ జరుగగా.. హర్మన్‌సేనే టైటిళ్లు కైవసం చేసుకుంది.

తుది జట్లు
సూపర్‌నోవాస్‌: చమరి ఆటపట్టు, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, శశికళ సిరివర్ధనే, అనుజా పాటిల్, పూజా వస్త్రకర్, రాధా యాదవ్, తానియా భాటియా, షకీరా సెల్మన్, పూనమ్ యాదవ్, అయబోంగా ఖాకా.

ట్రయల్‌ బ్లేజర్స్‌: స్మృతి మంధనా, డియాండ్రా డొటిన్, రిచా ఘోష్, దీప్తి శర్మ, నుజాత్ పర్వీన్, హర్లీన్ డియోల్, సోఫీ ఎక్లెస్టోన్‌, సల్మా ఖాతున్, నాటక్కన్ చంతం, రాజేశ్వరీ గైక్వాడ్‌, జులన్‌ గోస్వామి.

Story first published: Monday, November 9, 2020, 19:21 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+