Women's T20 Challenge: మెరిసిన లుస్.. ఆకట్టుకున్న సుష్మ.. సూపర్‌నోవాస్‌పై వెలాసిటీ సూపర్ విక్టరీ!!

షార్జా: ఐపీఎల్ 2020 మ్యాచుల లాగానే మహిళల టీ20 ఛాలెంజ్ 2020 కూడా అభిమానులను అలరించింది. మొదటి మ్యాచే ఉత్కంఠంగా సాగింది. ధనాధన్ లీగ్ తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ సారథ్యంలోని వెలాసిటీ జట్టు అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. సూపర్‌నోవాస్ నిర్ధేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని వెలాసిటీ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సునే లుస్ (37; 21 బంతుల్లో, 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. సుష్మ వర్మ (34; 33 బంతుల్లో, 2×6) ఆకట్టుకుంది. సూపర్‌నోవాస్ బౌలర్ అయబొంగా ఖాకా రెండు వికెట్లు తీసింది.

నిరాశపరిచిన మిథాలీ:
సునాయాస లక్ష్య ఛేదనకు దిగిన వెలాసిటీకి ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ డేనియల్ వ్యాట్ ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరింది. ఈ సమయంలో షెఫాలీ వర్మ (17), మిథాలీ రాజ్ (7) ఆచితూచి ఆడారు. ఆపై షెఫాలీ హ్యాట్రిక్ ఫోర్లు బాది ఊపులోకి వచ్చింది. అయితే ఆ తర్వాతి బంతికే ఔట్ అయింది. ఈ సమయంలో మిథాలీ సింగల్ తీయడానికి కూడా చాలా ఇబ్బందిపడింది. దీంతో స్కోర్ వేగం పూర్తిగా తగ్గిపోయింది. ఈ సమయంలో మిథాలీ ఓ భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరింది. అనంతరం నిలకడగా ఆడుతున్న వేదా కృష్ణమూర్తి (29) ఔట్ కావడంతో 65 పరుగులకే వెలాసిటీ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

టాప్ లేపిన లుస్:
ఓ దశలో వెలాసిటీకి గెలుపు కష్టమే అని అనుకున్నారు అందరూ. అయితే ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సునే లుస్, సుష్మ వర్మ ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చారు. తొలుత వికెడ్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు.. ఆ తర్వాత గేర్ మార్చి బౌండరీల మోత మోగించారు. దీంతో స్కోరు వేగం అమాంతం పెరిగింది. లుస్ వేగంగా ఆడింది. 19వ ఓవర్లో సుష్మ ఔటవ్వడంతో సూపర్‌నోవాస్ తిరిగి పోటీలోకి వచ్చింది. ఆఖరి ఓవర్‌లో 9 పరుగులు అవసరమవ్వగా లుస్ రెండో బంతికి బౌండరీ బాదడంతో మిథాలీ సేన విజయం లాంఛనమైంది. సూపర్‌నోవాస్ బౌలర్లలో అయబొంగ రెండు.. రాధా, పూనమ్, శశికల తలో వికెట్ తీశారు.

మెరిసిన చమరి:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సూపర్‌నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 126 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన హర్మన్‌సేనకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ప్రియ (11) ఆదిలోనే వెనుదిరగడంతో పవర్‌ప్లేలో ఆ జట్టు 32 పరుగులు చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన జెమిమా (7) కూడా త్వరగానే ఔట్ అయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్ (31; 27 బంతుల్లో, 1×4, 2×6)తో కలిసి చమరి ఆటపట్టు (44: 39 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. తొలుత నిదానంగా ఆడినా ఈ జోడి తర్వాత దూకుడుగా ఆడింది. ఈ సమయంలో సూపర్‌నోవాస్ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు. వెలాసిటీ బ్యాటర్లలో శశికల (18), పూజ (0), రాధ (2), షకీరా (5) పరుగులు చేశారు. వెలాసిటీ బౌలర్లలో ఎక్తా మూడు వికెట్లు పడగొట్టింది.
MI vs DC: పొలార్డ్.. ఢిల్లీతో జరిగే ప్లేఆఫ్ మ్యాచ్ ఆడకు!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications