Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: పొలార్డ్‌.. ఢిల్లీతో జరిగే ప్లేఆఫ్‌ మ్యాచ్‌ ఆడకు!!

IPL 2020, MI vs DC: Kieron Pollard shares cryptic post on Instagram after MI defeat against SRH

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 13వ సీజన్‌లో మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యచ్‌లో ముంబైపై సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సన్‌రైజర్స్‌ ఛేదిందించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (85; 58 బంతుల్లో 10×4, 1×6), వృద్ధిమాన్ సాహా (58; 45 బంతుల్లో, 7×4, 1×6)లు అజేయ అర్ధ శతకాలతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ మ్యచ్‌లో కీరన్ పొలార్డ్‌ (41; 25 బంతుల్లో, 2×4, 4×6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

అణిచివేసే వారికంటే:

అణిచివేసే వారికంటే:

ఈ మ్యాచ్ ‌తర్వాత ముంబై ఇండియన్స్‌ వైస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విటర్‌లో ఒక ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. పొలార్డ్‌పై ఎవరో తెలియని కోపం ప్రదర్శిస్తున్నారనేలా ఆ కామెంట్‌లో అర్ధం వచ్చేలా‌ ఉంది. ఇంతకు ఆ ట్వీట్‌లో ఏముందంటే... 'రహస్యంగా స్నేహం ముసుగులో నన్ను అణిచివేసే వారికంటే.. నేను శత్రువుగా భావించని వారు నన్ను ఎక్కువ ద్వేషిస్తున్నారు' అని పొలార్డ్‌ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గందరగోళానికి గురవుతున్న ఫాన్స్:

గందరగోళానికి గురవుతున్న ఫాన్స్:

ఈ పోస్ట్ చూసిన అభిమానులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఆ కామెంట్‌ ఎవరిని ఉద్దేశించి చేశాడని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. తాజాగా వన్డే జట్టుకు కీరన్‌ పొలార్డ్‌ స్థానంలో జాసన్‌ హోల్డర్‌ను ఎంపిక చేశారు. ఇక రోహిత్‌ శర్మ గైర్హాజరీలో ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) మ్యాచ్‌కు రోహిత్‌ అందుబాటులోకి రావడంతో.. పొలార్డ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.

నువ్ లేకుండా ముంబై లేదు:

నువ్ లేకుండా ముంబై లేదు:

కొందరేమో కీరన్‌ పొలార్డ్‌ ఆ కామెంట్‌ చేయడం వెనుక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అని.. మరికొందరు మాత్రం జాసన్‌ హోల్డర్‌ ఉన్నాడని అంటున్నారు. ఏదేమైనా నెటిజన్లు మాత్రం ఆ కామెంట్‌పై జోకులు పేల్చుతున్నారు. 'పొలార్డ్‌.. నువ్వు ఢిల్లీతో జరిగే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఆడకు. అప్పుడే నీ విలువ రోహిత్‌ శర్మకు అర్థమవుతుంది' అని ఒకరు కామెంట్‌ చేశారు. మీ కోపానికి కారణం రోహిత్ లేదా హోల్డరా.. చెప్పండి', 'ముంబై నీకు అండగా లేదు', 'అధైర్య పడకు పోలార్డ్.. నువ్ లేకుండా ముంబై లేదు' అని రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా గురువారం జరగనున్నమొదటి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

రోహిత్.. టీమిండియా కంటే ఐపీఎల్‌ ఆడటమే నీకు ముఖ్యమా: మాజీ కెప్టెన్‌ ఫైర్

Story first published: Wednesday, November 4, 2020, 22:59 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+