Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేడు ఫైనల్‌ మ్యాచ్.. తుది జట్లు ఇవే.. టైటిల్‌ ఎవరిదో!!

Womens T20 Challenge 2020, Supernovas vs Trailblazers Preview: Predicted Playing XI

షార్జా: ఐపీఎల్‌ 2020 ఫైనల్‌కు ముందు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే మహిళల టీ20 ఛాలెంజ్‌ 2020 ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌.. ట్రయల్‌బ్లేజర్స్‌ను ఢీకొంటుంది. వరుసగా మూడో టైటిల్‌పై హర్మన్‌ప్రీత్‌ సేన కన్నేయగా.. స్మృతి మంధాన జట్టు తొలి ట్రోఫీ కోసం ఆరాటపడుతోంది. ఇప్పటివరకు 2018, 2019ల్లో మహిళల టీ20 చాలెంజ్‌ జరుగగా.. హర్మన్‌సేనే టైటిళ్లు కైవసం చేసుకుంది. లీగ్‌ దశ చివర మ్యాచ్‌లో బ్లేజర్స్‌పై సూపర్‌నోవాస్‌‌ గెలువడంతో రెండు జట్లు తుదిపోరుకు చేరగా.. నెట్ రన్‌ రేట్‌ తక్కువగా ఉండడంతో మిథాలీరాజ్‌ కెప్టెన్సీలోని వెలాసిటీ ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.

ఫామ్‌లో ఆటపట్టు‌:

ఫామ్‌లో ఆటపట్టు‌:

సూపర్‌నోవాసే ఫైనల్ మ్యాచ్‌లో ఫేవరెట్‌. గత మ్యాచ్‌లో గెలిచిన సూపర్‌నోవాస్‌ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. శ్రీలంక ఓపెనర్‌ చమరి ఆటపట్టు‌ సూపర్‌ ఫామ్‌ సూపర్‌నోవాస్‌కు పెద్ద సానుకూలాంశం. రెండు మ్యాచ్‌ల్లో ఆమె 111 పరుగులు చేసింది. ముఖ్యంగా ట్రయల్‌బ్లేజర్స్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ (48 బంతుల్లో 67) ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ 31 పరుగుల వద్ద ఔటైన హర్మన్‌ప్రీత్..‌ ఫైనల్లో టాప్‌ ఫామ్‌ను అందుకోవాలనుకుంటోంది. రోడ్రిగ్స్, పునియా, భాటియా రాణించాల్సిన అవసరం ఉంది.

మంధాన బ్యాట్‌ జుళిపిస్తే:

మంధాన బ్యాట్‌ జుళిపిస్తే:

తొలి మ్యాచ్‌లో వెలాసిటీని 47కే కుప్పకూల్చిన ట్రయల్‌ బ్లేజర్స్‌ శనివారం ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. రెండు మ్యాచ్‌లో కలిపి 39 పరుగులే చేసిన కెప్టెన్‌ మంధాన బ్యాట్‌ ఝుళిపించాల్సివుంది. ఓపెనర్‌ డియాండ్రా డాటిన్‌ రాణిస్తోంది కానీ.. పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలి. సూపర్‌నోవాస్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన దీప్తి శర్మ (43 నాటౌట్‌), హర్లీన్‌ (15 బంతుల్లో 27) మరోసారి సత్తా చాటాలని బ్లేజర్స్‌ ఆశిస్తోంది. రిచా ఘోష్, హేమలత, హర్లీన్ డియోల్ ఫామ్ అందుకుంటే మంధాన సేనకు తిరుగుండదు.

స్పిన్‌ ప్రధాన బలం:

స్పిన్‌ ప్రధాన బలం:

సూపర్‌నోవాస్‌, ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్లకు స్పిన్‌ విభాగం ప్రధాన బలం. బ్లేజర్స్‌ టీమ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ టీ20 బౌలర్‌ సోఫీ ఎక్లెస్టోన్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌ రాణిస్తున్నారు. వెలాసిటీతో మ్యాచ్‌లో సోఫీ 9 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీసింది. మరోవైపు నోవాస్‌ జట్టులో భారత లెగ్‌ స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌, రాధా యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. ఇక పేస్‌ విభాగానికి వస్తే బ్లేజర్స్‌లో సీనియర్‌ జులన్‌ గోస్వామి రాణిస్తుండగా.. సూపర్‌ నోవాస్‌లో సౌతాఫ్రికన్‌ అయబోంగా ఖాకా, షకీరా సెల్మన్‌ ఉన్నారు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

సూపర్‌నోవాస్‌: చమరి ఆటపట్టు, ప్రియా పునియా, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, శశికళ సిరివర్ధనే, అనుజా పాటిల్/పూజా వస్త్రకర్, రాధా యాదవ్, తానియా భాటియా/షకీరా సెల్మన్, పూనమ్ యాదవ్, అయబోంగా ఖాకా.

ట్రయల్‌ బ్లేజర్స్‌: స్మృతి మంధనా, డియాండ్రా డొటిన్, రిచా ఘోష్, దీప్తి శర్మ, డి హేమలత, హర్లీన్ డియోల్, సోఫీ ఎక్లెస్టోన్‌, సల్మా ఖాతున్, నాటక్కన్ చంతం, రాజేశ్వరీ గైక్వాడ్‌, జులన్‌ గోస్వామి.

Qualifier 2: పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌.. తొలిసారి ఐపీఎల్ ఫైనల్లోకి ఢిల్లీ.. ముంబైతో అమీతుమీ!!

Story first published: Monday, November 9, 2020, 11:11 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+