Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Qualifier 2: పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌.. తొలిసారి ఐపీఎల్ ఫైనల్లోకి ఢిల్లీ.. ముంబైతో అమీతుమీ!!

 Marcus Stoinis help Delhi Capitals seal maiden final berth

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌‌కు చేరుకుంది. మంగళవారం జరిగే టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఐపీఎల్‌-13వ సీజన్‌ క్వాలిఫయర్‌-2లో భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ తడబడింది. 20 ఓవర్లలో 8 నష్టానికి 172 రన్స్ చేసి.. 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో సన్‌రైజర్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కేన్ విలియమ్సన్‌ (67: 45 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబాడ 4, మార్కస్‌ స్టోయినీస్ 3 వికెట్లు పడగొట్టారు.

ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ:

ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ:

భారీ లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ (2) నిరాశపరిచాడు. కాగిసో రబాడ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికి వార్నర్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక ప్రియం గార్గ్ ‌(17), మనీష్‌ పాండే (21)లు పరుగు తేడాలో ఔట్‌ కావడంతో.. సన్‌రైజర్స్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్కస్ స్టోయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌ నాలుగు, ఆరు బంతులకు వరుసగా గార్గ్‌, పాండేలు ఔట్‌ కావడంతో ఆరెంజ్‌ ఆర్మీ 44 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

విలియమ్స్‌ పోరాటం:

విలియమ్స్‌ పోరాటం:

ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాసన్ హోల్డర్‌ (11; 15 బంతుల్లో, 1×4)తో కలిసి కేన్ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ హోల్డర్‌ను అక్షర్‌ పటేల్‌ బోల్తా కొట్టించాడు. అయినా కూడా విలియమ్సన్‌ తన పోరాటం కొనసాగించాడు. సిక్సర్లు బాదుతూ కావాల్సిన రన్‌రేట్‌ సాధించే స్థితిలో ఉంచాడు. ఈ క్రమంలోనే విలియమ్స్‌ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్‌లో కేన్‌కిది 15వ అర్ధ శతకం. కేన్, అబ్దుల్‌ సమద్‌ (33; 16 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు)లు చెలరేగడంతో ఆరెంజ్ ఆర్మీ విజయం దిశగా సాగింది. ఇక్కడే స్టాయినిస్‌ మరోసారి దెబ్బతీశాడు. 17వ ఓవర్‌లో విలియమ్సన్‌ ఔట్‌ చేసి స్కోరు వేగానికి కళ్లెం వేశాడు. తర్వాత రబాడ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీయడంతో హైదరాబాద్‌ ఓటమి ఖరారైంది. రషీద్‌ ఖాన్‌ (11), గోస్వామి (0), నదీమ్‌ (2), సందీప్‌ (2) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టోయినిస్‌ మూడు వికెట్లు తీశాడు.

మెరిసిన స్టోయినిస్:

మెరిసిన స్టోయినిస్:

తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీకి అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్లు మార్కస్ స్టోయినిస్ (38; 27 బంతుల్లో 5×4, 1×6), శిఖర్ ధావన్‌ తొలి వికెట్‌కు 86 పరుగులు జోడించారు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్‌ను పొందిన స్టోయినిస్.. ఆ తర్వాత చెలరేగిపోయాడు. అతడికి తోడుగా ధావన్‌ కూడా మెరవడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ 65 పరుగులు సాధించింది. కానీ 9వ ఓవర్‌లో స్టోయినిస్‌ను రషీద్‌ బోల్తా కొట్టించాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ (21; 20 బంతుల్లో, 1×4)తో కలిసి ధావన్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

26 బంతుల్లో ధావన్ అర్ధ శతకం:

26 బంతుల్లో ధావన్ అర్ధ శతకం:

ధాటిగా ఆడిన శిఖర్ ధావన్ 26 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. దూకుడుగా ఆడే యత్నంలో శ్రేయస్‌ ఔటైనప్పటికీ.. ఢిల్లీ స్కోరు వేగం మాత్రం తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్‌మైయర్‌ (42; 22 బంతుల్లో 4×4, 1×6) బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. అయితే ఆఖరి రెండు ఓవర్లలో హైదరాబాద్ కట్టుదిట్టంగా బంతులు వేసి 13 పరుగులే ఇచ్చింది. 19వ ఓవర్‌లో ధావన్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్, రషీద్‌, హోల్డర్‌ తలో వికెట్ తీశారు. మంగళవారం తుది సమరంలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ తలపడనుంది.

Story first published: Monday, November 9, 2020, 7:43 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+