Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Women's IPL వేలానికి రంగం సిద్దం.. కనీస ధర ఎంతంటే? జనవరి 26 డెడ్‌లైన్!

Womens IPL: BCCI announces deadline of January 26 for Player Auction registration

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్‌కు రంగం సిద్దమైంది. ఈ ఏడాదే ఐదు ఫ్రాంచైజీలతో మహిళల ఐపీఎల్ నిర్వహిస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఈ లీగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్న బీసీసీఐ.. ఆ దిశగా కసరత్తులు ప్రారంభించింది.

ఇప్పటికే మీడియా హక్కుల కోసం టెండర్లను ఆహ్వానించిన బోర్డు.. జట్ల ఎంపిక, ఆటగాళ్ల వేలం ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. పురుషుల మాదిరి వేలం ద్వారానే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ప్రకటించిన బీసీసీఐ.. ప్లేయర్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 26ను డెడ్‌లైన్‌గా విధించింది. అంతేకాకుండా ఆటగాళ్ల కనీస ధరలను ఐదు విభాగాలుగా విభజించినట్లు తెలుస్తోంది.

రూ.10 లక్షల కనీస ధర..

రూ.10 లక్షల కనీస ధర..

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అమ్మాయిలు, సెంట్రల్‌ కాంట్రాక్టుల్లో ఉన్నవారు రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షల కనీస ధరల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అరంగేట్రం చేయని క్రికెటర్లు రూ.10 లక్షలు, రూ.20 లక్షల విభాగాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. మహిళల ఐపీఎల్‌లో స్థానిక క్రికెటర్లు ఎక్కువ పాల్గొనేలా చూడాలని రాష్ట్ర సంఘాలను బీసీసీఐ ఆదేశించింది. విదేశీ క్రికెటర్లకూ ఈ ఐదు విభాగాలే ఉంటాయని తెలిపింది. అయితే ఈ కనీస ధరల గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఫిబ్రవరిలో వేలం..

ఫిబ్రవరిలో వేలం..

మహిళల ఐపీఎల్‌ క్రికెటర్ల వేలం తేదీని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. ఫిబ్రవరి 11న వేలం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 6 నుంచి 26 వరకు మహారాష్ట్రలోని వేదికల్లో మ్యాచులు నిర్వహిస్తారని సమాచారం. వేలంలో నమోదు చేసుకొనే క్రికెటర్లు తమ వ్యక్తిగత స్పాన్సర్లను ధ్రువీకరించాల్సి ఉంటుంది. మహిళల ఐపీఎల్‌ మీడియా హక్కులకు మంచి స్పందన లభించినట్లు తెలుస్తోంది. పదికి పైగా కంపెనీలు టెండర్‌ పత్రాలను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిస్నీ స్టార్‌, సోనీ నెట్‌వర్క్‌, వయాకామ్‌ 18తో పాటు అమెజాన్‌ ప్రైమ్‌, ఫ్యాన్‌ కోడ్‌, టైమ్స్‌ ఇంటర్నెట్‌, గూగుల్‌, డిస్కవరీ సంస్థలు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. టెండర్‌ పత్రాలు సమర్పించేందుకు జనవరి 12 చివరి తేదీ కాగా.. మీడియా హక్కులకు బీసీసీఐ కనీస ధర నిర్ణయించలేదు.

మీడియా రైట్స్ అమ్మకం తర్వాతే..

మీడియా రైట్స్ అమ్మకం తర్వాతే..

మీడియా హక్కుల వ్యవహారం పూర్తయ్యాక ఫ్రాంచైజీలను విక్రయించనుంది. ప్రసార హక్కుల విలువను బట్టి ఆదాయంపై ఫ్రాంచైజీలు అంచనాకు రానున్నాయి. 'మీడియా హక్కుల వ్యవహారం పూర్తవ్వగానే ఫ్రాంచైజీ హక్కుల టెండర్లను ఆహ్వానిస్తాం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మహిళల ఐపీఎల్‌లో ప్రతి ఫ్రాంచైజీ రూ.1000 కోట్లకు పైగా ఆదాయం సృష్టిస్తాయని అంచనా వేశారు.

జోన్ల వారిగా జట్లు..

జోన్ల వారిగా జట్లు..

ఇప్పుడున్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే అమ్మాయిల జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే మహిళా ఫ్రాంచైజీలు తీసుకునేందుకు పోటీ పడుతామని ప్రకటించాయి. అయితే జోన్ల వారీగా ఫ్రాంచైజీలను విక్రయించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. నార్త్‌ (ధర్మశాల/జమ్ము), సౌథ్‌ (కోచి/వైజాగ్‌), సెంట్రల్‌ (ఇండోర్‌/రాయ్‌పుర్‌/నాగ్‌పుర్‌), ఈస్ట్‌ (రాంచీ/కటక్‌), నార్త్‌ ఈస్ట్‌ (గువాహటి), వెస్ట్‌ (పుణె/రాజ్‌కోట్‌) ప్రాతిపదికన జట్లను విక్రయించే అవకాశం ఉంది.

Story first published: Saturday, January 7, 2023, 17:41 [IST]
Other articles published on Jan 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+