Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రేపే భారత్ X పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే?

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్దమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దాయాదుల పోరు శనివారం జరగనుంది. ఫార్మాట్ ఏదైనా.. విభాగం మరేదైనా భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకం. ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఈ పోరును ఆసక్తికరంగా తిలకిస్తోంది.

స్మృతి మంధాన భారీ శతకం.. హాంకాంగ్‌పై ఘన విజయం!

స్మృతి మంధాన భారీ శతకం.. హాంకాంగ్‌పై ఘన విజయం!

గత కొంత కాలంగా భారత్‌కు పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. పురుషుల, మహిళల క్రికెట్‌లోనూ భారత్‌దే ఆధిపత్యం సాగుతోంది. అయినా ఇరు దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో దాయాదుల పోరుకు క్రేజ్ కొనసాగుతోంది.

మ్యాచ్ టైమింగ్స్ ఏంటంటే..?

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా శనివారం రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా భారత్ X పాక్ మ్యాచ్ మొదలవ్వనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన భారత మహిళల జట్టు మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

Women s Asia Cup 2026 How to Watch India vs Pakistan Match Time and Live Streaming Details

కాబట్టి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ వామప్‌లా ఉపయోగించుకోనుంది. మరోవైపు పాకిస్థాన్ మహిళల టీమ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గెలుపొందింది. ఆ జట్టు సెమీస్ బెర్త్ దక్కించుకోవాలంటే భారత్‌ను ఓడించాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇరు జట్ల గత రికార్డ్ చూసుకున్నా.. ఫామ్ పరిశీలించినా భారత్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

ఎలా చూడాలంటే..?

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీకి సోనీ నెట్ వర్క్‌ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ టీవీతో పాటు సోనీ లీవ్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఫ్రీగా చూసే ఆస్కారం లేదు. ప్రత్యేక రిఛార్జ్ ప్లాన్స్‌తో సోనీ లీవ్ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీగా పొందవచ్చు.

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

Also Read

IND vs AFG: ఆ ఇద్దరూ ఏం తప్పు చేశారు.. ఎందుకు తప్పించారు: మాజీ క్రికెటర్

ఇరు జట్లు:

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, భారతీ ఫుల్‌మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్ (కీపర్), జి కమలిని (వికె), అరుంధతి రెడ్డి, ప్రేమ రావత్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, నందనీ శర్మ, క్రాంతి గౌడ్.

పాకిస్థాన్: ఫాతిమా సనా (కెప్టెన్), అయేషా జాఫర్, ఎమాన్ నసీర్, ఈమాన్ ఫాతిమా, గుల్ ఫిరోజా, మోమినా రియాసత్, మునీబా అలీ సిద్ధిఖీ (వైస్ కెప్టెన్), సదాఫ్ షమాస్, నష్రా సుంధు, సాదియా ఇక్బాల్, సైరా జబీన్, షావాల్ జుల్ఫికర్, ఉమ్మ్-హస్సాన్.

Story first published: Friday, September 4, 2026, 18:04 [IST]
Other articles published on Sep 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+