Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2024: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఓటమి! ఫైనల్లో భారత్ X శ్రీలంక

మహిళల ఆసియా కప్ టోర్నీ 2024 ఫైనల్‌కు ఆతిథ్య శ్రీలంక అర్హత సాధించింది. పాకిస్థాన్ జట్టుతో శుక్రవారం ఉత్కంఠగా సాగిన రెండో సెమీఫైనల్లో శ్రీలంక మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఇరు జట్లను ఊరించిన విజయం చివరకు శ్రీలంకనే వరించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. గుల్ ఫెరోజా(25), మునీబా అలీ(37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్‌హరి, ప్రబోధని రెండేసి వికెట్లు తీసారు.

No India vs Pakistan

అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 141 పరుగులు చేసి ఉత్కంఠ విజయాన్నందుకుంది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(48 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 63) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. పాకిస్థాన్ బౌలర్లలో సదియా ఇక్బాల్(4/16) నాలుగు వికెట్లు తీయగా. నిదా దార్, ఒమైమా సోహైల్ తలో వికెట్ తీసారు.

దంబుల్లా వేదికగా ఆదివారం జరిగే ఆసియాకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులే చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో కెప్టెన్ నిగర్ సుల్తానా(51 బంతుల్లో 2 ఫోర్లతో 32), షోర్నా అక్తర్(18 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

అనంతరం భారత్ 11 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ(28 బంతుల్లో 2 ఫోర్లతో 26 నాటౌట్) ఆచితూచి ఆడగా.. స్మృతి మంధాన(39 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్)అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగింది.

Story first published: Friday, July 26, 2024, 23:33 [IST]
Other articles published on Jul 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+