For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Wisden's World Test Playing 11: రోహిత్ శర్మతో పాటు భారత్‌ నుంచి నలుగురు.. కోహ్లీకి దక్కని చోటు!

Wisdens World Test Playing 11: Rohit Sharma, Jasprit Bumrah In And Virat Kohli Out

లండన్: ప్రతిష్టాత్మక క్రికెట్‌ మ్యాగజీన్‌ విజ్డెన్‌ అల్మనాక్‌ ఈ తరం వరల్డ్ టెస్ట్ ఎలెవన్ ప్రకటించింది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్ రికార్డ్స్ పరిగణలోకి తీసుకొని ఈ జట్టును ఎంపిక చేసిన విజ్డెన్ ప్యానల్.. భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలతో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కింది.

అయితే టెస్ట్ క్రికెట్‌కు ప్రతిరూపంగా నిలిచే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీకి బదులు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్‌కు ఆ స్థానంలో చోటు దక్కింది.

ఓపెనర్లుగా రోహిత్, లబుషేన్..

ఓపెనర్లుగా రోహిత్, లబుషేన్..

ఈ అత్యుత్తమ జట్టులో రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా ప్లేయర్ లబుషేన్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశారు. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు 43 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 3047 రన్స్ చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 2019లో ఓపెనర్‌గా అవతారమెత్తిన హిట్‌మ్యాన్ టెస్ట్ క్రికెట్‌లో నిలకడగా రానిస్తున్నాడు. ఇక నిలకడమకు మారుపేరైన లబుషేన్.. 18 మ్యాచ్‌ల్లో 1885 రన్స్ చేశాడు. అయితే ఫస్ట్ డౌన్‌లో ఆడే లబుషేన్.. ఓపెనర్‌గా ఈ జట్టులోకి ఎంపికయ్యాడు.

మిడిల్ ఆర్డర్‌లో..

మిడిల్ ఆర్డర్‌లో..

ఇక మిడిలార్డర్‌లో జోరూట్‌, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, మహమ్మద్ రిజ్వాన్ చోటు దక్కించుకున్నారు. జోరూట్ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌‌తో ఇంటా బయట రాణించిన జోరూట్... 101 మ్యాచ్‌ల్లో 9278 రన్స్ చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, 23 సెంచరీలున్నాయి.

స్టీవ్ స్మిత్ సైతం మంచి టెస్ట్ క్రికెటరనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 77 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 7,540 రన్స్ చేశాడు. ఇక ఈ టీమ్‌కు కెప్టెన్‌గా పేర్కొన్న కేన్ విలియమ్సన్.. 85 మ్యాచ్‌ల్లో 7230 రన్స్ చేశాడు. తనదైన సారథ్యం, ఆటతీరుతో న్యూజిలాండ్‌కు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ అందించాడు. వికెట్ కీపర్‌గా పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కింది. 17 మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్.. 914 రన్స్ చేసింది.

 ఆల్‌రౌండర్లుగా జడేజా, అశ్విన్..

ఆల్‌రౌండర్లుగా జడేజా, అశ్విన్..

ఇక ఈ జట్టులో ఆల్‌రౌండర్లుగా భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు చోటు దక్కించుకున్నారు. ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 413 వికెట్లు తీయగా.. జడేజా 34 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు పడగొట్టాడు. భారత టెస్ట్ విజయాల్లో ఈ ఇద్దరి పాత్ర కీలకం. బౌలింగ్‌లోనే కాకుండా లోయరార్డర్‌లో బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటగలరు. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్ సత్తా చాటగా.. ఆసీస్ పర్యటనలో జడేజా రాణించాడు.

పేస్ త్రయం..

పేస్ త్రయం..

ఈ జట్టులో పేసర్లుగా ప్యాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్, జస్‌ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. ఈ ముఖ్యంగా వరల్డ్ బెస్ట్ బౌలర్లే. కమిన్స్ 34 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. అండర్సన్ 166 మ్యాచ్‌ల్లో 632 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అయితే 24 మ్యాచ్‌ల్లో 101 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ముగ్గురు తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. సొంతగడ్డపై భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ దుమ్మురేపగా.. బుమ్రా సైతం రాణించాడు.

విజ్డెన్ వరల్డ్ ఎలెవన్..

విజ్డెన్ వరల్డ్ ఎలెవన్..

రోహిత్ శర్మ, మార్నస్ లబుషేన్, జోరూట్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, మహమ్మద్ రిజ్వాన్(కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, జస్‌ప్రీత్ బుమ్రా, జేమ్స్ అండర్సన్

Story first published: Thursday, November 25, 2021, 15:33 [IST]
Other articles published on Nov 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+