ఇప్పుడు మ్యాచే.. నెక్ట్స్ టీమిండియా ప్లేసే! రిషభ్ పంత్‌కు మొగుడిలా మారిన కేఎస్ భరత్!

హైదరాబాద్: కేఎస్ భరత్.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. ఇన్నాళ్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానులకు మాత్రమే తెలిసిన ఈ తెలుగు కుర్రాడు.. ఒక్క సిక్స్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ప్రతీ క్రికెట్ అభిమాని.. 'ఎవరు? ఈ కేఎస్ భరత్'అని గూగుల్‌లో సెర్చ్ చేసేలా ఆడాడు. మరి అతను కొట్టిన సిక్స్ అలాంటిది. ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే జట్టు గెలుస్తుందనే కఠిన పరిస్థితుల్లో.. పరుగులు చేయడమే కష్టంగా మారిన అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో లాస్ట్ బాల్ సిక్స్ బాది ఆర్‌సీబీకి చిరస్మరణీయ 100వ విజయాన్నందించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన కోన శ్రీకర్ భరత్.. ఆంధ్రా రంజీ జట్టు వికెట్ కీపర్. భారత్-ఏ తరఫున ఆడాడు.
బ్యాకప్ ప్లేయర్‌గా టీమిండియాతో పలు పర్యటనలకు వెళ్లాడు. కానీ ఇప్పటి వరకు అతనికి అవకాశం దక్కలేదు. గుర్తింపు రాలేదు. కష్టేఫలి అని నమ్మిన భరత్.. తనదైన రోజు కోసం ఇన్నాళ్లు నిరీక్షించాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఆర్‌సీబీ తరఫున వచ్చిన తొలి ఐపీఎల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫస్టాఫ్‌లో బెంచ్‌కే పరమితమైనా నిరాశ చెందలేదు. రెండో దశలో అటు వికెట్ కీపర్‌గా సత్తా చాటుతూ.. టీమ్‌మేనేజ్‌మెంట్‌కు అనుగుణంగా రాణిస్తూ మ్యాచ్ విన్నర్‌గా ఎదిగాడు. కోట్లు పెట్టి తీసుకున్న ఆటగాళ్లు చెతులెత్తేసిన వేళ.. రూ.20 లక్షల కనీస ధరకు తీసుకున్న కేఎస్ భరత్ ఆర్‌సీబీకి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.
సెకండాఫ్ లీగ్‌లోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన కేఎస్ భరత్.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు 5 ఇన్నింగ్స్‌ల్లో 182 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తాజాగా ఆడిన అతని ఇన్నింగ్స్ మరిచిపోలేనిది. ముఖ్యంగా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం అద్భుతం. ప్రస్తుతం పంత్‌కు మ్యాచ్ ఓటమినే మిగిల్చిన కేఎస్ భరత్.. భవిష్యత్తులో ఇలానే రాణిస్తే త్వరలోనే టీమిండియాకు ఆడగలడు. ఇప్పటికే ప్రత్యామ్నాయ కీపర్‌గా పలు పర్యటనలకు వెళ్లిన భరత్.. టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వృద్దిమాన్ సాహా కెరీర్ ముగింపు దశకు చేరడంతో.. అతని స్థానంలో కేఎస్ భరత్‌కు చోటు దక్కనుంది.
వేగంగా కదలడం, పరిణతితో ఆలోచించడం, ఫస్ట్ స్లిప్‌లోకి సైతం డైవ్ చేసి బంతిని అందుకోగల ఒడుపు, ఆదిలోనే తొందరపడకుండా వేచి చూసే నేర్పు, అద్భుతమైన కంటి-చేతి సమన్వయం, బ్యాట్స్‌మన్ వెనక్కి తిరిగి చూసేలోపే వికెట్లు గిరాటేయడం, బంతి పిచ్ అవ్వడానికి ముందే ఊహించి పొజిషన్‌లోకి వెళ్లడం భరత్ ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకమైన ప్రతిభతోనే భరత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు మ్యాచ్‌తోనే పంత్‌ను వదిలిపెట్టిన భరత్.. భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తే మాత్రమ అతనికి మొగుడై కూర్చుంటాడు. ఈ సీజన్‌లో అటు కీపింగ్‌లోను ఇటు బ్యాటింగ్‌లోను దుమ్మురేపుతున్నాడు. తన ఆటతో ఆర్‌సీబీకి టైటిల్ అందిస్తానని 'భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను'అని చెప్పకనే చెబుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications