For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తలకు తాకిన రాకాసి బౌన్సర్‌... కుప్పకూలిన బ్యాటర్(వీడియో)

ఆస్ట్రేలియా బ్యాటర్ విల్ పుకోవ్‌స్కీ మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు. బౌలర్ వేసిన రాకాసి బౌన్సర్ అతని తలకు బలంగా తాకడంతో మైదానంలో కుప్పకూలాడు. ఈ ఊహించని ఘటనతో ఆటగాళ్లతో పాటు అంపైర్లు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫిజియోలు హుటాహుటిన మైదానంలోకి వచ్చి అతనికి చికిత్స చేశారు.

కొద్ది సేపటి వరకు విల్ పుకోవ్‌స్కీ కళ్లు తెరవలేకపోయాడు. ఫిజియోల ప్రాథమిక చికిత్స అనంతరం మాములు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిలిప్ హ్యూస్ మరణ ఉదంతాన్ని గుర్తు చేసిన ఈ ఘటన ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌ టోర్నీలో చోటు చేసుకుంది. రంజీ ట్రోఫీ తరహాలో జరిగే షేఫిల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా విక్టోరియా, త్సమానియా మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది.

Will Pucovski Retires Hurt After Head Blow In Sheffield Shield Match Video Goes Viral

ఈ మ్యాచ్‌లో విక్టోరియా తరఫున బరిలోకి దిగిన విల్ పుకోవ్‌స్కీ.. త్సమానియా బౌలర్ రిలే మెరిడిత్ వేసిన బౌన్సర్ అతని తలకు బలంగా తాకింది. దాంతో విల్ పుకోవ్‌స్కీ కుప్పకూలాడు. ఫిజియోలు వచ్చి ప్రథమి చికిత్స చేయగా.. కళ్లు నలుపుకుంటూ మైదానం వీడాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు షాకవుతున్నారు.

విల్‌పుకోవ్‌స్కీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని విక్టోరియా టీమ్ తమ ప్రకటనలో పేర్కొంది. 'విల్ పుకోవ్‌స్కీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. చికిత్స పూర్తయిన తర్వాత అతని గాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం. కంకషన్ నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాటర్ కాంప్‌బెల్.. పుకోవ్‌స్కీ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు.'అని విక్టోరియా టీమ్ అధికారిక ప్రతినిథి వెల్లడించాడు.

2021 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పుకోవ్‌స్కీ.. భారత్‌తో ఒకే ఒక టెస్ట్ మ్యాచ్‌ ఆడాడు. పుకోవ్‌స్కీ తలకు బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది జనవరిలోనూ అతని తలకు బలమైన గాయమైంది. ఈ క్రమంలోనే అతను ఓ ఇంటర్వ్యూలో ఫిజికల్ ఇంజ్యూరీస్‌తో పాటు మానసిక ఆరోగ్యం తనకు ఛాలెంజ్‌గా మారింది.‌

పదేళ్ల క్రితం (2014, నవంబర్ 25న) ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఇదే తరహా రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు వదిలాడు. ఇదే షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా సిడ్నీ క్రికెట్‌ మైదానంలో సౌత్‌ ఆస్ట్రేలియా, న్యూసౌత్‌ వేల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి పేసర్‌ విసిరిన బౌన్సర్‌ సౌత్‌ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ అయిన ఫిలిప్ హ్యూస్‌కు బలంగా తగిలింది.

హెల్మెట్‌ ధరించినప్పటికీ రక్షణ లేని ఎడమచెవి కింది భాగంలో(మెడకు) బంతి తాకింది. దాంతో అతను నేలపై కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొని కోమాలోకి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో కన్నుమూశాడు.

Story first published: Sunday, March 3, 2024, 20:38 [IST]
Other articles published on Mar 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+