Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IP 2022: సన్‌రైజర్స్‌కు మరో తలనొప్పి! కేన్ మామకు గాయం.. బ్యాకప్ కెప్టెన్ ఎవరు?

Will Kane Williamson Justify As SRH Captain In IPL 2022

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో మెగా ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే లీగ్‌లోని పది ఫ్రాంచైజీలు వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బలమైన కోర్ టీమ్‌ను తీసుకోవాలని భావిస్తున్నాయి. ఇక గత సీజన్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారైన సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలనుకుంటుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ అబ్డుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు.. వేలంలో భారత స్టార్ ప్లేయర్లను తీసుకోవాలనుకుంటుంది.

కేన్ మామకు గాయమైతే..

కేన్ మామకు గాయమైతే..

అయితే మెగా వేలానికి ముందే ఆ జట్టుకు మరో తలనొప్పి మొదలైంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయపడితే జట్టును నడిపించే ఆటగాడు ఎవరా? అనే ప్రశ్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌ను వెంటాడుతోంది. గత కొంత కాలంగా కేన్ విలియమ్సన్ టెన్నిస్ ఎల్బో గాయంతో బాధపడుతున్నాడు. గత సీజన్‌లో కూడా అతను కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ ఆ గాయం తిరగబెట్టే అవకాశాలున్నాయి. అదే జరిగితే సన్‌రైజర్స్ పరిస్థితి ఏందనేది? ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భారత స్టార్లపై..

భారత స్టార్లపై..

రిటెన్షన్ జాబితాలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు తీసుకున్న సన్‌రైజర్స్.. బ్యాకప్ కెప్టెన్‌ను దృష్టిలో పెట్టుకొని వేలంలో పాల్గొనాల్సి ఉంది. ఆటగాళ్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా ఓవర్‌సీస్ ఆటగాళ్లపైనే ఆధారపడ్డ సన్‌రైజర్స్ ఈ సారైన టీమిండియా స్టార్ ప్లేయర్లపై దృష్టిసారించాల్సి ఉంది. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాజీ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లను కూడా తీసుకునేందుకు వెనుకాడవద్దు.

అంబటి రాయుడు వస్తే..

అంబటి రాయుడు వస్తే..

ఇక తెలుగు క్రికెటర్ అంబటి రాయుడిని తీసుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని తీసుకుంటే బ్యాకప్ కెప్టెన్ ఆప్షన్ సన్‌రైజర్స్‌కు లభిస్తుంది. దేశవాళీ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం రాయుడికి ఉంది. శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్‌లు చిక్కినా సన్‌రైజర్స్ పెద్ద తలనొప్పి తప్పినట్లే. స్టార్ ప్లేయర్‌లపైనే కన్నేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎవరీని తీసుకుంటుందో చూడాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద ఇంకా రూ. 68 కోట్ల పర్స్ మనీ ఉంది. ఇందులో నుంచి 50 కోట్లను స్టార్ ప్లేయర్లకు ఖర్చు చేసి మిగతా 18 కోట్లతో మిగతా స్థానాలను భర్తీ చేయవచ్చు.

Story first published: Wednesday, February 2, 2022, 20:52 [IST]
Other articles published on Feb 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+