Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అబ్బరే కొడుకా.. వాటే క్యాచ్! మైండ్ బ్లోయింగ్!(వీడియో)

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ది హండ్రెడ్ లీగ్ టోర్నీలో ఎంఐ లండన్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విల్ జాక్స్.. లండన్ స్పిరిట్ టీమ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అద్వితీయమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌండరీ లైన్‌పై అతను చేసిన ఫీల్డింగ్ విన్యాసం చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని ఆపడమే కాకుండా.. లోపలికి విసిరేసి మళ్లీ వచ్చి డైవ్ చేసి బంతిని అందుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. క్యాచ్ ఆఫ్ ది టోర్నీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Will Jacks Takes an Incredible Catch During London Spirit vs MI London in The Hundred Video

అసలేం జరిగిందంటే..?

లండన్ స్పిరిట్ ఇన్నింగ్స్ 49వ బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది. నాథన్ సౌటెర్ వేసిన ఈ బంతిని లాన్-డీ ప్రిటోరియస్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్‌పై విల్ జాక్స్ గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను మైదానంలోకి విసిరేసి తిరిగి వచ్చి అద్భుతమైన డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు లాన్-డీ ప్రిటోరియస్ బిత్తరపోయాడు.

ఎంఐ లండన్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో ఎంఐ లండన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటంగ్ చేసిన లండన్ స్పిరిట్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. డ్రీ ప్రిటోరియస్(52), డేవిడ్ విల్లే(31), జేమ్స్ కోల్స్(30 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఎంఐ లండన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ సోవ్‌టర్ రెండేసి వికెట్లు తీయగా.. రిచర్డ్ గ్లీసన్ ఒక వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఎంఐ లండన్ 94 బంతుల్లో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(39), సామ్ కరణ్(33), సికిందర్ రజా(32) రాణించారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్(2/23) రెండు వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే, మాథ్యూ ఫిషర్, మాసన్ క్రేన్ తలో వికెట్ తీసారు. ఈ టోర్నీ ఎంఐ లండన్‌ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

Story first published: Friday, August 7, 2026, 12:08 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+