For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 5th Test: భార‌త క్రికెట్ జ‌ట్టులో మరొకరికి కరోనా.. ఐదో టెస్ట్ అనుమానమే!!

Will India Vs England 5th Test Happen, Corona Test To Decide It

మాంచెస్ట‌ర్‌: ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టిస్తున్న భార‌త క్రికెట్ జ‌ట్టులో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. మాంచెస్టర్‌ వేదికగా శుక్రవారం (సెప్టెంబర్‌ 10) నుంచి ఇంగ్లండ్‌తో ప్రాంభంబమవ్వాల్సిన ఐదో టెస్ట్‌కు ముందు భారత శిబిరంలో మరో కరోనా కేసు బయటపడింది. జట్టుతో పాటు ఉన్న సహాయక సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈరోజు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. అలాగే జట్టు సభ్యులందరికీ మరోసారి కోవిడ్ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ ఆందోళనగా ఉంది.

క్వారెంటైన్‌లో కోచ్‌లు

క్వారెంటైన్‌లో కోచ్‌లు

మొదటగా టీమిండియా హెడ్ కోచ్ ర‌విశాస్త్రికి కూడా క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ఓ బుక్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ర‌విశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. చాలా ర‌ద్దీ ఉన్న ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు ఆ ఇద్ద‌రిపై బీసీసీఐ అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ర‌విశాస్త్రితో సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధ‌ర్‌లను క్వారెంటైన్‌లో ఉంచారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టులోని ఆటగాళ్లకు కానీ, వారి కుటుంబ సబ్యులకు కానీ ఎవ్వ‌రికీ వైర‌స్ సోక‌లేదు. కానీ స‌పోర్ట్ స్టాఫ్‌తో స‌న్నిహితంగా ఉన్న కార‌ణంగా బీసీసీఐ పలు జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. అందులో భాగంగానే అందరికి ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు.

సహాయక సిబ్బందికి క‌రోనా

సహాయక సిబ్బందికి క‌రోనా

బుధ‌వారం టెస్టులు చేసిన త‌ర్వాత సహాయక సిబ్బందిలో ఒకరికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. గురువారం ఉద‌యం కూడా మరోసారి టెస్టింగ్ చేశారు. ఆ రిజ‌ల్ట్స్ కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వైరస్ సోకిన స్టాఫ్ మెంబెర్ క్వారెంటైన్‌లో ఉన్నాడు. నాలుగ‌వ టెస్ట్ స‌మ‌యంలో వైర‌స్ సోకిన కోచ్‌ల‌ను.. జ‌ట్టుతో పాటు మాంచెస్ట‌ర్‌కు రానివ్వ‌లేదు.

టీమ్ ఫిజియో నితిన్ ప‌టేల్‌ను కూడా క్వారెంటైన్‌లోనే ఉన్నాడు. లండన్ ప్ర‌భుత్వ రూల్స్ ప్ర‌కారం పాజిటివ్ వ‌చ్చిన వాళ్లు ప‌ది రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉండాలి. ఆ త‌ర్వాత రెండు సార్లు నెగ‌టివ్ వ‌స్తేనే వాళ్లు బ‌య‌ట‌కు వెళ్లాలి. ప్ర‌స్తుతం లండ‌న్‌లోనే ర‌విశాస్త్రి, అరుణ్‌, శ్రీధ‌ర్‌లు క్వారెంటైన్‌లో ఉన్నారు.

T20 World Cup 2021: స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్.. పటిష్టంగానే ఇంగ్లండ్ జట్టు! టీమిండియాను ఓడించే సత్తావుందా?

ఐదో టెస్టు అనుమానమే

ఐదో టెస్టు అనుమానమే

భారత కోచ్‌లు పాజిటివ్‌గా తేల‌డంతో ప్లేయ‌ర్లంద‌రికీ ఆర్టీ-పీసీర్ ప‌రీక్ష‌లు చేయించారు బీసీసీఐ అధికారులు. ఎవరికీ పాజిటివ్ రాలేదు. ఇక మాంచెస్ట‌ర్‌లో ఉన్న జ‌ట్టు స‌భ్యుల‌తో సంప్ర‌దించిన బీసీసీఐ.. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్ టెస్టును ర‌ద్దు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు సమాచారం తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ స్టార్ట్ అవుతున్న నేప‌థ్యంలో.. మెగా టోర్నీపై ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో బీసీసీఐ ఉన్న‌ది.

అందుకే రేప‌టి నుంచి ప్రారంభం అయ్యే ఐదో టెస్టు చివ‌రి వ‌ర‌కు స్టార్ట్ అయ్యేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతం ఐదు టెస్టులో సిరీస్‌లో భార‌త్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఒకవేళ ఇదో టెస్ట్ జరగకుంటే.. సిరీస్ అసంపూర్ణంగా ఉంటుంది. అంటే.. మిగిలిన టెస్ట్ తరువాత ఆడవలసి ఉంటుంది. ఈరోజు వచ్చే కోవిడ్ టెస్టుల రిపోర్టులపై ఐదో టెస్ట్ జరిగేది లేనిది ఆధారపడివుంది.

 ఇంగ్లండ్‌లో భారత్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌

ఇంగ్లండ్‌లో భారత్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌

వచ్చే సంవత్సరం జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నట్టు ఆ దేశ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బుధవారం వెల్లడించింది. 2022లో స్వదేశంలో ఇంగ్లండ్‌ జట్టు ఆడే సిరీసుల వివరాలు ప్రకటించిన సందర్భంగా ఈ విషయం తెలిపింది. కరోనా కారణంగా సుదీర్ఘ పర్యటనలు నివారించే ఉద్దేశంతో గతంలో మాదిరి కాకుండా భారత జట్టు టెస్ట్‌లు, పరిమిత ఓవర్ల సిరీ్‌సలను విడివిడిగా నిర్వహిస్తున్నారు.

జూలై ఒకటిన ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్‌ మొదలుకానుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్‌ (జూలై 3), ఏజెస్‌ బౌల్‌ (జూలై 6)లో జరుగుతాయి. 3వన్డేలను ఎడ్జ్‌బాస్టన్‌ (జూలై 9), ఓవల్‌ (జూలై 12), లార్డ్స్‌ (జూలై 14)లో నిర్వహిస్తారు.

Story first published: Thursday, September 9, 2021, 18:22 [IST]
Other articles published on Sep 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+